SRH vs CSK, IPL 2020: ఐపిఎల్ 2020లో 29వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 20పరుగుల తేడాతో విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 8వికెట్లు నష్టానికి 147పరుగులు మాత్రమే చేసింది. ఈ సిరీస్‌లో చెన్నైకి ఇది మూడవ విజయం. చావోరేవో అనుకుని కీలకంగా మారిన మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు ఆరవ స్థానంలోకి వచ్చింది.
అంతకుముందు టాస్ గెలిచిన తరువాత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా వచ్చిన ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరుకోగా.. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన ఆల్ రౌండర్ శామ్ కుర్రాన్ 21 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
The Pursuit of Happiness. ?? #WhistlePodu #Yellove #WhistleFromHome #SRHvCSK pic.twitter.com/MOr7V6NTO9
— Chennai Super Kings (@ChennaiIPL) October 13, 2020
అనంతరం అంబటి రాయుడు, షేన్ వాట్సన్ చెన్నై ఇన్నింగ్స్‌ను నడిపించారు. రాయుడు 34 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు సాయంతో 41 పరుగులు చేశాడు. అదే సమయంలో, వాట్సన్ 38 బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్లతో 42 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 81 పరుగుల కీలక భాగస్వామ్యం జట్టుకు అందజేశారు.
అయితే రెండు వరుస ఓవర్లలో వాట్సన్, రాయుడు అవుట్ అయిన తరువాత, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని స్కోరును 165కి తీసుకున్నారు. ధోని 13 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 21 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. జడేజా మూడు ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో కేవలం 10 బంతుల్లో 25 పరుగులు చేశాడు.
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్లందరూ అద్భుతంగా బౌలింగ్ చేశారు. సందీప్ శర్మ అత్యంత విజయవంతం అయ్యాడు. సందీప్ తన కోటాలోని నాలుగు ఓవర్లలో 19 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టగా.. అదే సమయంలో ఖలీల్ అహ్మద్, టి నటరాజన్ కూడా తలా రెండు వికెట్లు తీసుకున్నారు.
అనంతరం 168పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆరంభంలో అధ్భుతంగా ఆడగా.. వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 23పరుగుల వద్ద జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ 9 పరుగులు చేసి సామ్ కుర్రాన్ బంతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీని తరువాత మనీష్ పాండే కూడా మూడు బంతుల్లో నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
తరువాత, జానీ బెయిర్‌స్టో మరియు కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను నిర్వహించడానికి ప్రయత్నించారు, కానీ బెయిర్‌స్టో 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తర్వాత విలియమ్సన్ మాత్రం వేగంగా స్కోరు రాబట్టేందుకు ప్రయత్నించాడు. ఏడు ఫోర్ల సహాయంతో విలియమ్సన్ కేవలం 39 బంతుల్లో 57 పరుగులు చేశాడు. కానీ అతని హాఫ్ సెంచరీ తన జట్టును గెలిపించలేదు. తర్వాత రషీద్ ఖాన్ ఎనిమిది బంతుల్లో 14 పరుగులు చేశాడు. కానీ అతను కూడా తన జట్టును విజయానికి దగ్గరగా తీసుకురాలేకపోయాడు.
డ్వేన్ బ్రావో చెన్నై తరఫున అత్యుత్తమ బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లలో 25 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. కరణ్ శర్మ నాలుగు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. శామ్ కర్రన్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్‌లు ఒక్కొక్క వికెట్ పడగొట్టారు.
Sir Jaddu rising up to the occasion in all the departments to take home the Man of the Match and Super Striker of the Match awards! ?? #WhistlePodu #Yellove #WhistleFromHome #SRHvCSK @imjadeja pic.twitter.com/x9OqXk4NfL
— Chennai Super Kings (@ChennaiIPL) October 13, 2020