I am Rishabh Pant: ‘నేను రిషబ్ పంత్‌ని’.. కారు ప్రమాదానికి గురైన వెంటనే ఓ వ్యక్తికి చెప్పిన క్రికెటర్

'నేను రిషబ్ పంత్‌ని’.. కారు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన తర్వాత తనను రక్షించడానికి వచ్చిన ఓ బస్సు డ్రైవర్ తో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చెప్పిన మాట ఇది. రిషబ్ పంత్ ఇవాళ ఘోర కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆయనకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ వద్దకు వెళ్లిన తొలి వ్యక్తి బస్ డ్రైవర్ సుశీల్. కారు అద్దాలు పగుటగొట్టి రిషబ్ పంత్ ను తానే అందులో నుంచి బయటకు లాగానని సుశీల్ మీడియాకు తెలిపారు.

I am Rishabh Pant

I am Rishabh Pant: ‘నేను రిషబ్ పంత్‌ని’.. కారు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన తర్వాత తనను రక్షించడానికి వచ్చిన ఓ బస్సు డ్రైవర్ తో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చెప్పిన మాట ఇది. రిషబ్ పంత్ ఇవాళ ఘోర కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆయనకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ వద్దకు వెళ్లిన తొలి వ్యక్తి బస్ డ్రైవర్ సుశీల్.

కారు అద్దాలు పగుటగొట్టి రిషబ్ పంత్ ను తానే అందులో నుంచి బయటకు లాగానని సుశీల్ మీడియాకు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన రిషబ్ పంత్ తాను ఎవరన్న విషయాన్ని చెప్పాడని సుశీల్ చెప్పారు. రిషబ్ పంత్ ప్రమాదానికి గురైన తర్వాత కుంటుతూ కనపడ్డాడని ఆయన అన్నారు. కారుకి మంటలు అంటుకుని, చెలరేగాయని చెప్పారు.

తాను బస్సులో హరిద్వార్ మార్గం నుంచి వస్తున్నానని, రిషబ్ పంత్ ఢిల్లీ వైపు నుంచి వచ్చాడని అన్నారు. రిషబ్ పంత్ కారు డివైడర్ ను ఢీ కొట్టిన వెంటనే తాను బస్సు బ్రేక్ వేసి, దాన్ని ఆపి ఆ కారు వద్దకు వెళ్లానని తెలిపారు. కాగా, పంత్ కారు బారికేడ్ ను ఢీ కొట్టి దాదాపు 200 మీటర్ల మేర జారుకుంటూ వెళ్లినట్లు తెలుస్తోంది.

పంత్ కు జరిగిన ప్రమాదంపై డీడీసీఏ కార్యదర్శి సిద్దార్థ్ సాహిబ్ సింగ్ మాట్లాడుతూ… ‘‘పంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’’ అని చెప్పారు. పంత్ కు అయ్యే వైద్య ఖర్చు అంతా ఉత్తరాఖండ్ ప్రభుత్వం భరిస్తుందని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ చెప్పారు. ఇప్పటికే ఆయన ఈ విషయంపై సంబంధిత అధికారులతో మాట్లాడారు.

Uzbekistan deaths: ఆ భారతీయ కంపెనీలో అన్ని రకాల ఔషధాల తయారీ నిలిపివేత