ICC Awards 2023: ఐసీసీ అవార్డుల్లో భారత్ ఆధిపత్యం.. పాకిస్థాన్‌కు ఘోర అవమానం.. పూర్తి జాబితా ఇదే

2023 సంవత్సరానికి సంబంధించిన అవార్డులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. పాకిస్థాన్ నుంచి పురుషులు, మహిళా జట్ల నుంచి ఏఒక్కరూ అవార్డులను గెలుచుకోలేక పోయారు.

ICC Awards 2023

Team india : 2023 సంవత్సరానికి సంబంధించిన అవార్డులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. భారత్ కు చెందిన విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అవార్డులు గెలుచుకున్నారు. కోహ్లీ పురుషుల వన్డే క్రికెట్ ఆఫ్ ద ఇయర్ గా, సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచాడు. ఐసీసీ 2023 సంవత్సరానికి టీ20 జట్టుకు సూర్యను కెప్టెన్ గా ఎంపిక చేయగా.. రోహిత్ శర్మ వన్డే జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో పాకిస్థాన్ కు ఒక్క అవార్డు కూడా దక్కలేదు. పాకిస్థాన్ నుంచి పురుషులు, మహిళా జట్ల నుంచి ఏఒక్కరూ అవార్డులను గెలుచుకోలేక పోయారు. విశేషం ఏమిటంటే.. జింబాబ్వేకు చెందిన ఆటగాళ్లు కూడా ఐసీసీ పురుషుల టీ20 జట్టులో చోటు దక్కించుకోవటం గమనార్హం.

Also Read ; Virat Kohli : త‌గ్గేదేలే.. ఐసీసీ మెన్స్ క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్-2023గా విరాట్ కోహ్లీ

ఐసీసీ అవార్డులు -2023 పూర్తి జాబితా ..

  • పురుషుల విభాగంలో..
    వన్డే క్రికెట్ ఆఫ్ ద ఇయర్ : విరాట్ కోహ్లీ (భారత్)
    క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోపీ) : పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)
    టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ : ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా)
    టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ : సూర్యకుమార్ యాదవ్ (భారత్)
    ఎమర్జింగ్ పురుషుల క్రికెట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ : రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)
    అసోసియేట్ క్రికెటర్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ : బాస్ డి లీడ్ (నెదర్లాండ్స్)
    ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ : రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ (ఇంగ్లండ్)
    ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు : జింబాబ్వే
  • మహిళల విభాగంలో..
    ఉమెన్స్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ (రాచెల్ హేహో ప్లింట్ ట్రోపీ) : నాట్ స్కివర్ -బ్రంట్ (ఇంగ్లండ్)
    మహిళా టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ : హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్).
    మహిళల వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ : చమరి ఆటపట్టు (శ్రీలంక)
    ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ : ఫోబో లిచ్‌ఫీల్డ్ (ఆస్ట్రేలియా)
    ఉమెన్స్ అసోసియేట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ : క్వింటర్ అబెల్ (కెన్యా)

Also Read : చారిత్రాత్మ‌క మైలురాయిని చేరుకున్న అశ్విన్‌-జ‌డేజా జోడీ.. కుంబ్లే-భ‌జ్జీల ఆల్‌టైమ్ రికార్డు బ‌ద్ద‌లు..

  • ఐసీసీ పురుషుల టెస్ట్ టీం 2023 : ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆర్. అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్.
  • ఐసీసీ పురుషుల వన్డే జట్టు 2023 : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్ , ఆడమ్ జంపా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.
  • ఐసీసీ పురుషుల టీ20 జట్టు 2023 : ఫిల్ సాల్ట్, యశస్వీ జైస్వాల్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), మార్క్ చాప్ మన్, సికందర్ రజా, అల్పేష్ రమాజానీ, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ నగరవ.
  • ఐసీసీ మహిళల వన్డే జట్టు 2023 : ఫోబ్ లిచ్ ఫీల్డ్, చమరి ఆటపట్టు (కెప్టెన్), ఎలిసా పెర్రీ, అమేలియా కెర్, బెత్ మూనీ (వికెట్ కీపర్), నాట్ స్కివర్ -బ్రంట్, యాష్లే గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, నాడిన్ డి క్లెర్క్, లీ తహుహు, నహిదా అక్తర్.
  • ఐసీసీ మహిళల టీ20 జట్టు 2023 : చమరి ఆటపట్టు (కెప్టెన్), బెత్ మూనీ (వికెట్ కీపర్), లారా వోల్వార్డ్ట్, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్ -బ్రంట్, అమేలియా కెర్, ఎలిసా పెర్రీ, ఆష్లే గార్డనర్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్ స్టోన్, మెగాన్.

 

ట్రెండింగ్ వార్తలు