ICC : బంగ్లాదేశ్ ఆల్‌రౌండ‌ర్‌కు ఐసీసీ భారీ షాక్‌.. రెండేళ్ల పాటు నిషేదం.. ఎందుకంటే..?

బంగ్లాదేశ్ ఆల్‌రౌండ‌ర్ నాసిర్ హొస్సేన్ కు ఐసీసీ భారీ షాకిచ్చింది.

Nasir Hossain

ICC Bans Bangladesh Cricketer : బంగ్లాదేశ్ ఆల్‌రౌండ‌ర్ నాసిర్ హొస్సేన్ కు ఐసీసీ భారీ షాకిచ్చింది. అత‌డి పై నిషేదం విధించింది. రెండు సంవ‌త్స‌రాల పాటు అత‌డు ఏ ర‌క‌మైన క్రికెట్ ఆడేందుకు వీలు లేకుండా చేసింది. అవినీతి నిరోధ‌క నియ‌మావ‌ళిని ఉల్లంఘించినందుకు గాను ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.

అబుదాబి టీ10 లీగ్ 2020-21 ఎడిషన్‌లో అత‌డు పూణె డెవిల్స్ ఫ్రాంచైజీ త‌రుపున ఆడాడు. ఆ స‌మ‌యంలో మ‌రో ఏడుగురితో క‌లిసి అత‌డు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై ఐసీసీ 2023 సెప్టెంబ‌ర్‌లో అభియోగాలు న‌మోదు చేసింది. ఐసీసీ అవినీతి నిరోధ‌క విభాగం దీనిపై విచార‌ణ ప్రారంభించింది. విచార‌ణ‌లో అత‌డు ఫిక్సింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు తెలిసింది. అత‌డికి ఖ‌రీదైన ఐఫోన్ 12 బ‌హుమ‌తిగా అందిన‌ట్లు తెలిసింది.

IND vs AFG 3rd T20 : మూడో టీ20కి ముందు.. భార‌త ఆట‌గాళ్ల‌ను క‌లిసేందుకు ఎవ‌రొచ్చారో చూశారా..?

ఫిక్సింగ్‌కు సంబంధించి బుకీలు సంప్ర‌దించిన విష‌యాల‌ను ఏ ద‌శ‌లోనూ అత‌డు ఐసీసీ అధికారుల‌కు తెలియ‌జేయ‌లేదు. విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో అత‌డి పై నిషేదం విధించారు. నిషేదం కార‌ణంగా 2025 ఏప్రిల్ 7 వ‌ర‌కు నాసిర్ హొస్సేన్ అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడేందుకు వీలులేదు. ఆ త‌రువాత‌నే అత‌డు ఆడేందుకు అవ‌కాశం ఉంది. కాగా.. ప్ర‌స్తుతం అత‌డి వ‌య‌స్సు 32 ఏళ్లు. దీంతో అత‌డి కెరీర్ దాదాపుగా ముగిసిన‌ట్లేన‌ని ప‌లువురు క్రీడా పండితులు అంచ‌నా వేస్తున్నారు.

కాగా.. నాసిర్ హొస్సేన్ బంగ్లాదేశ్ త‌రుపున 31 టీ20లు, 65 వ‌న్డేలు, 19 టెస్టు మ్యాచులు ఆడాడు.

MS Dhoni : ధోనిని క‌లిసిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్‌.. ‘అప్పుడు ఓ ఆట‌గాడిగా ఇష్ట‌ప‌డేదాన్ని కానీ ఇప్పుడు..’

ట్రెండింగ్ వార్తలు