Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ సమరం ప్రారంభం నేడే.. పూర్తి షెడ్యూల్, ఫ్రైజ్ మనీ.. ప్రత్యక్ష ప్రసారం వివరాలతోసహా..

వన్డేల్లో ప్రపంచ కప్ తరువాత అత్యంత ఆసక్తి రేకెత్తించే, రసవత్తరంగా సాగే ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది.

Champions Trophy 2025

Champions Trophy 2025: వన్డేల్లో ప్రపంచ కప్ తరువాత అత్యంత ఆసక్తి రేకెత్తించే, రసవత్తరంగా సాగే ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి పాకిస్థాన్ వేదికగా ట్రోఫీ ప్రారంభం కానుంది. 2017 తరువాత రద్దయి.. మళ్లీ ఇప్పుడు మొదలవుతున్న ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుంది. అయితే, ఇండియా ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో ఇవాళ తొలిపోరు పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీ వేదికగా జరగనుంది. రేపు (గురువారం) దుబాయ్ వేదికగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్లు ఆడనున్నాయి.

ఈ టోర్నీలో ఎనిమిది జట్లు నాలుగు వేదికల్లో కలిపి మొత్తం 12లీగ్ మ్యాచ్ లు, రెండు సెమీఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి. భారత్ ఆడే మూడు లీగ్ మ్యాచ్ లు మినహా మిగతా వాటికి పాకిస్థాన్ వేదిక కానుంది. భారత్ జట్టు సెమీఫైనల్, ఫైనల్ చేరితే ఆ రెండు మ్యాచ్ లు కూడా దుబాయ్ లోనే జరగనున్నాయి. మరో సెమీఫైనల్ కు మాత్రం పాకిస్థాన్ ఆతిధ్యమిస్తుంది. భారత్ ఫైనల్ చేరకపోతే టైటిల్ పోరును పాకిస్థాన్ గడ్డపైనే నిర్వహిస్తారు.

గ్రూప్ -ఏ : భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.
గ్రూప్ -బి : ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్

ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ -18 టీవీ చానెల్స్ లో, జియో హాట్ స్టార్ యాప్ లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.

ఫ్రైజ్ మనీ ఎంతంటే..
♦ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫ్రైజ్‌మ‌నీ మొత్తం  69లక్షల డాలర్లు (రూ.60కోట్లు).
♦ విజేత జట్టుకు 22 లక్షల 40వేల డాలర్లు (రూ.19కోట్ల 47లక్షలు).
♦ రన్నరప్ జట్టుకు – 11లక్షల 20వేల డాలర్లు (రూ.9కోట్ల73లక్షలు).
♦ సెమీఫైనలిస్ట్ – 5లక్షల 60వేల డాలర్లు (రూ.4కోట్ల 86లక్షలు).
♦ సెమీఫైనలిస్ట్ – 5లక్షల 60వేల డాలర్లు (రూ.4కోట్ల 86లక్షలు).
♦ 5,6వ స్థానాల్లో నిలిచిన జట్లకు 3లక్షల50వేల డాలర్లు (రూ.3కోట్ల13లక్షలు)
♦ 7, 8వ స్థానాల్లో నిలిచిన జట్టకు 1లక్ష40వేల డాలర్లు (రూ.కోటి 21లక్షలు).
♦ గ్రూప్ దశలో ప్రతి విజయానికి ఒక్కో జట్టుకు 34వేల డాలర్లు (రూ.29లక్షల56వేలు) అందజేస్తారు.
♦ పార్టిసిపేషన్ ఫీజు కింద ఎనిమిది జట్లకు 1లక్ష25వేల డాలర్ల (రూ.కోటి 8లక్షలు) చొప్పున ఇస్తారు.

ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్ ఇలా..
♦ ఫిబ్రవరి 19- పాకిస్తాన్ vs న్యూజిలాండ్ ( నేషనల్ స్టేడియం, కరాచీ)
♦ ఫిబ్రవరి 20 – బంగ్లాదేశ్ vs ఇండియా (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)
♦ ఫిబ్రవరి 21- ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా (నేషనల్ స్టేడియం, కరాచీ)
♦ ఫిబ్రవరి 22 – ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ (గడాఫీ స్టేడియం, లాహోర్)
♦ ఫిబ్రవరి 23 – పాకిస్తాన్ వర్సెస్ ఇండియా (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)
♦ ఫిబ్రవరి 24 – బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
♦ ఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
♦ ఫిబ్రవరి 26- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (గడాఫీ స్టేడియం, లాహోర్)
♦ ఫిబ్రవరి 27- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి)
♦ ఫిబ్రవరి 28- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (గడాఫీ స్టేడియం, లాహోర్)
♦ మార్చి 1- దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ (నేషనల్ స్టేడియం, కరాచీ)
♦ మార్చి 2- న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా (దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్)
♦ మార్చి 4 (సెమీ ఫైనల్-1) – దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్.
♦ మార్చి 5 (సెమీ ఫైనల్ 2) – గడాఫీ స్టేడియం, లాహోర్
♦ మార్చి 9 (ఫైనల్) – గడాఫీ స్టేడియం, లాహోర్ (టీం ఇండియా ఫైనల్‌కు చేరుకుంటే వేదిక దుబాయ్ అవుతుంది)

 

టోర్నీలో గత విజేతలు..
1998 – దక్షిణాఫ్రికా
2000 – న్యూజిలాండ్
2002 – భారత్ – శ్రీలంక (సంయుక్త విజేతలు)
2004 – వెస్టిండీస్
2006 – ఆస్ట్రేలియా
2009 – ఆస్ట్రేలియా
2013 – భారత్
2017 – పాకిస్థాన్