AUS vs NZ: ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరిత పోరు.. పోరాడి ఓడిన న్యూజిలాండ్

న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. వరల్డ్ కప్ ఆసీస్ తమ మూడో అత్య్తుత్తమ స్కోరు నమోదు చేసింది.

icc cricket world cup 2023 today australia vs New Zealand live match

ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరిత పోరు.. పోరాడి ఓడిన న్యూజిలాండ్
ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పోరాడి ఓడింది. 5 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమి చవిచూసింది. 389 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసింది. చివరల్లో జేమ్స్ నీషమ్ హాఫ్ సెంచరీతో పోరాడటంతో కివీస్ లక్ష్యానికి అతి చేరువగా వచ్చింది.

ఏడో వికెట్ కోల్పోయిన కివీస్
320 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. మిచెల్ సాంట్నర్ 17 పరుగులు చేసి ఆడమ్ జంపా బౌలింగ్ లో అవుటయ్యాడు.

రచిన్ రవీంద్ర సెంచరీ
రచిన్ రవీంద్ర సెంచరీ చేశాడు. 77 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల తో శతకం పూర్తి చేశాడు. సిక్సర్ తో అతడు సెంచరీ పూర్తి చేయడం విశేషం. ఈ ప్రపంచకప్ లో అతడికిది రెండో సెంచరీ. 38 ఓవర్లలో 273/5 స్కోరుతో కివీస్ ఆట కొనసాగిస్తోంది. ఫిలిప్స్(12) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. 118 పరుగులు చేసి ఆరో వికెట్ గా రచిన్ రవీంద్ర పెవిలియన్ చేరాడు.

 

లాథమ్ అవుట్.. నాలుగో వికెట్ డౌన్
31.2 ఓవర్ లో 222 పరుగుల వద్ద న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. టామ్ లాథమ్ 21 పరుగులు చేసి ఆడమ్ జంపా బౌలింగ్ లో అవుటయ్యాడు.

రచిన్ రవీంద్ర హాఫ్ సెంచరీ
రచిన్ రవీంద్ర హాఫ్ సెంచరీ చేశాడు. 49 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ తో అర్ధశతకం పూర్తి చేశాడు. 31 ఓవర్లలో 221/3 స్కోరుతో కివీస్ ఆట కొనసాగిస్తోంది.

మిచెల్ అవుట్.. మూడో వికెట్ డౌన్
24 ఓవర్ లో 173 పరుగుల వద్ద న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. డారిల్ మిచెల్(54) ఆడమ్ జంపా బౌలింగ్ లో అవుటయ్యాడు.

విల్ యంగ్ అవుట్.. రెండో వికెట్ కోల్పోయిన కివీస్
9.4 ఓవర్ లో 72 పరుగుల వద్ద న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. విల్ యంగ్ 32 పరుగులు చేసి హాజిల్ వుడ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 11 ఓవర్లలో 79/2 స్కోరుతో కివీస్ ఆట కొనసాగిస్తోంది.

కాన్వే అవుట్.. తొలి వికెట్ కోల్పోయిన కివీస్
7.2 ఓవర్ లో 61 పరుగుల వద్ద న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. డెవాన్ కాన్వే 28 పరుగులు చేసి హాజిల్ వుడ్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

15 ఓవర్లలో కివీస్ 46/0
389 పరుగుల టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా 388 పరుగులకు ఆలౌట్
న్యూజిలాండ్ కు ఆస్ట్రేలియా 389 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.2 ఓవర్లలో పరుగులకు 388 పరుగులకు ఆలౌటయింది. ట్రావిస్ హెడ్ సెంచరీ (109; 67 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు), వార్నర్ హాఫ్ సెంచరీ (81, 65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు)లతో చెలరేగారు. గ్లెన్ మాక్స్‌వెల్ 41, జోష్ ఇంగ్లిస్ 38, పాట్ కమిన్స్ 37, మిచెల్ మార్ష్ 36, స్టీవెన్ స్మిత్ 18, లబుషేన్ 18 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, ఫిలిప్స్ మూడేసి వికెట్లు పడగొట్టారు. మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు తీశాడు. మాట్ హెన్రీ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

 

6 వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
325 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 6 వికెట్ కోల్పోయింది. గ్లెన్ మాక్స్‌వెల్ 41 పరుగులు చేసి అవుటయ్యాడు. 47 ఓవర్లలో 359/6 ఆసీస్ ఆట కొనసాగిస్తోంది.

ట్రావిస్ హెడ్ సెంచరీ
ట్రావిస్ హెడ్ సెంచరీతో చెలరేగాడు. 59 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ పూర్తిచేశాడు. 22 ఓవర్లలో 191/1 స్కోరుతో ఆసీస్ ఆట కొనసాగిస్తోంది.

 

వార్నర్ అవుట్.. ఫస్ట్ వికెట్ డౌన్
175 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్.. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ లో అవుటయ్యారు. వార్నర్ 65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81
పరుగులు చేశాడు.

15 ఓవర్లలో ఆసీస్ 151/0
ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ లో దుమ్మురేపుతోంది. 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 151 పరుగులు చేసింది. వార్నర్ 74, ట్రావిస్ హెడ్ 73 పరుగులతో ఆడుతున్నారు.

 

చెలరేగుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్లు
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా తొలి 67 ఓవర్లలో వికెట నష్టపోకుండా 60 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ చెలరేగి ఆడుతున్నారు. వార్నర్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. 25 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్లతో ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ బాదాడు.

న్యూజిలాండ్ ఫీల్డింగ్
AUS vs NZ: వన్డే ప్రపంచకప్ భాగంగా శనివారం ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియాలో టీమ్ ఒక మార్పు జరిగింది. కామ్ గ్రీన్ ప్లేస్ లో ట్రావిస్ హెడ్ జట్టులోకి వచ్చాడు. కివీస్ టీమ్ లో మార్క్ చాప్‌మన్‌ స్థానంలో జిమ్మీ నీషమ్ ఆడుతున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ 3, ఆస్ట్రేలియా 4వ స్థానంలో ఉన్నాయి.  సెమీస్ ఫైనల్ కు చేరువ కావాలంటే రెండు జట్లకు ఈరోజు మ్యాచ్ లో విజయం సాధించడం తప్పనిసరి.

 

తుది జట్లు
ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్/వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్