NZ vs PAK: న్యూజిలాండ్ పై పాకిస్థాన్ సంచలన విజయం

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్థాన్ దుమ్ము రేపింది. న్యూజిలాండ్ పై సంచలన విజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

icc cricket world cup 2023 today new zealand vs pakistan live match

పాకిస్థాన్ విజయం
న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ సంచలన విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ సగంలో నిలిచిపోవడంతో D/L పద్ధతిలో పాకిస్థాన్ ను విజేతగా ప్రకటించారు. ఈ విజయంతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. భారీ స్కోరు చేసినా ఓటమి ఎదురవడంతో కివీస్ డీలా పడింది. సెమీస్ చేరాలంటే మిగతా రెండు మ్యాచుల్లో తప్పనిసరిగా గెలివాల్పిందే.

వాన తగ్గడంతో ఆట మళ్లీ మొదలైంది. పాకిస్థాన్ మళ్లీ బాదుడు షురూ చేసింది. ఫఖర్ జమాన్, బాబర్ ఆజం ఎడాపెడా బాదుతున్నారు. దీంతో పాకిస్థాన్ 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 199 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ 125, బాబర్ ఆజం 66 పరుగులతో ఆడుతున్నారు. అయితే పాకిస్థాన్ స్కోరు 200 పరుగులు దాటగానే మరోసారి ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో 25.1 ఓవర్ లో మ్యాచ్ ఆగింది.

వర్షంతో ఆటకు అంతరాయం
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పాకిస్థాన్ దీటుగా బదులిస్తోంది. ఫఖర్ జమాన్ మెరుపు సెంచరీతో పరుగుల ప్రవాహం పారించాడు. అయితే వర్షం రావడంతో ఆటకు అంతరాయం కలిగింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 21.3 ఓవర్లలో పాక్ 160/1 స్కోరు చేసింది.

జమాన్ మెరుపు సెంచరీ
పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ సెంచరీతో చెలరేగాడు. 63 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో శతకం బాదాడు. వరల్డ్ కప్ లో వేగంగా సెంచరీ చేసిన పాకిస్థాన్ ప్లేయర్ నిలిచాడు. 20 ఓవర్లలో 152/1 స్కోరుతో పాకిస్థాన్ ఆట కొనసాగిస్తోంది.

పాకిస్థాన్ కు ప్రారంభంలోనే షాక్
402 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. అబ్దుల్లా షఫీక్ (4) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. 6 ఓవర్లలో 32/1 స్కోరుతో పాకిస్థాన్ ఆట కొనసాగిస్తోంది. ఫఖర్ జమాన్ (18), బాబర్ ఆజం(8) క్రీజ్ లో ఉన్నారు.

పాకిస్థాన్ కు న్యూజిలాండ్ భారీ టార్గెట్
పాకిస్థాన్ కు న్యూజిలాండ్ 402 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 401 పరుగులు చేసింది. ప్రపంచకప్ లో న్యూజిలాండ్ టీమ్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే. యంగ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర సెంచరీ (108; 94 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్)తో చెలరేగాడు. కేన్ విలియమ్సన్ 95, గ్లెన్ ఫిలిప్స్ 41, మార్క్ చాప్మన్ 39, డారిల్ మిచెల్ 29 పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ వాసిం జూనియర్ 3 వికెట్లు పడగొట్టాడు. హసన్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్ తలో వికెట్ తీశారు.

నాలుగో నష్టపోయిన కివీస్
41.1 ఓవర్ లో 318 పరుగుల వద్ద న్యూజిలాండ్ నాలుగో వికెట్ నష్టపోయింది. డారిల్ మిచెల్(29) హరీస్ రవూఫ్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

రచిన్ అవుట్.. మూడో వికెట్ డౌన్
35.5 ఓవర్ లో 261 పరుగుల వద్ద న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. సెంచరీ హీరో రచిన్ రవీంద్ర.. మహ్మద్ వాసిం జూనియర్ బౌలింగ్ లో సౌద్ షకీల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రచిన్ 94 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్ తో 108 పరుగులు చేశాడు.

విలియమ్సన్ సెంచరీ మిస్
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 5 పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. 79 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల 95 పరుగులు చేసి రెండో వికెట్ గా అవుటయ్యాడు.

రచిన్ రవీంద్ర సెంచరీ.. భారీ స్కోరు దిశగా కివీస్
న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర సెంచరీ సాధించాడు. 88 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ తో శతకం బాదాడు. ఈ ప్రపంచకప్ లో అతడికిది మూడో సెంచరీ కావడం విశేషం. 34 ఓవర్లలో 246/1 స్కోరుతో కివీస్ ఆట కొనసాగిస్తోంది. కేన్ విలియమ్సన్ 93 పరుగులతో ఆడుతున్నాడు.

 

200 పరుగులు దాటిన కివీస్ స్కోరు
29వ ఓవర్ లో న్యూజిలాండ్ స్కోరు 200 పరుగులు దాటింది. రచిన్ రవీంద్ర 88, కేన్ విలియమ్సన్ 60 పరుగులతో ఆడుతున్నారు.

విలియమ్సన్ హాఫ్ సెంచరీ
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 49 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ తో అర్ధశతకం పూర్తి చేశాడు. 28 ఓవర్లలో 187/1 స్కోరుతో కివీస్ ఆట కొనసాగిస్తోంది.

రచిన్ రవీంద్ర హాఫ్ సెంచరీ
న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర హాఫ్ సెంచరీ సాధించాడు. 51 బంతుల్లో 8 ఫోర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. 20 ఓవర్లలో 125/1 స్కోరుతో కివీస్ ఆట కొనసాగిస్తోంది. కేన్
విలియమ్సన్ 26 పరుగులతో ఆడుతున్నాడు.

 

100 పరుగులు దాటిన కివీస్ స్కోరు
న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. 15.4 ఓవర్ లో కివీస్ స్కోరు 100 పరుగులు దాటింది. 17 ఓవర్లలో 105/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. రచిన్ రవీంద్ర 42, కేన్ విలియమ్సన్ 22 పరుగులతో ఆడుతున్నారు.

కాన్వే అవుట్.. ఫస్ట్ వికెట్ డౌన్
10.5 ఓవర్ లో 68 పరుగుల వద్ద న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డెవాన్ కాన్వే (35; 39 బంతుల్లో 6 ఫోర్లు) హసన్ అలీ బౌలింగ్ లో అవుటయ్యాడు.

న్యూజిలాండ్ 10 ఓవర్లలో 65/0
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేశారు. డెవాన్ కాన్వే 34, రచిన్ రవీంద్ర 28 పరుగులతో ఆడుతున్నారు.

టాస్ గెలిచిన పాకిస్థాన్
పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించాడు. ఉసామా మీర్ స్థానంలో హసన్ అలీ ఆడుతున్నట్టు అతడు తెలిపాడు. న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం నుంచి కోలుకుని ఈ రోజు మ్యాచ్ లో ఆడుతున్నాడు. విల్ యంగ్ జట్టు నుంచి తప్పుకున్నాడు. మాట్ హెన్రీ స్థానంలో ఇష్ సోధి జట్టులోకి వచ్చాడు.

 

తుది జట్లు
పాకిస్థాన్ : అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఇఫ్తికర్ అహ్మద్, సౌద్ షకీల్, అఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, మహ్మద్ వాసిం జూనియర్, హరీస్ రవూఫ్

న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్

 

పాకిస్థాన్ కు చావోరేవో
NZ vs PAK: ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో 35వ మ్యాచ్ లో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. బెంగళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతోంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం. ముఖ్యంగా పాకిస్థాన్ ఈ రోజు మ్యాచ్ లో చావోరేవో తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే పాకిస్థాన్ కు సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. రెండు జట్లు ఇప్పటి వరకు ఏడేసి మ్యాచ్ లు ఆడాయి. న్యూజిలాండ్ 4 విజయాలు సాధించి 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పాకిస్థాన్ మూడింటిలో గెలిచి 6 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.