NZ vs SA: 190 ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికా విజ‌యం

పూణే వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించింది.

icc cricket world cup 2023 today new zealand vs south africa live match

NZ vs SA: పూణే వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా 190 ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 01 Nov 2023 09:12 PM (IST)

    ద‌క్షిణాప్రికా విజ‌యం..

    358 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ 35.3 ఓవ‌ర్ల‌లో 167 ప‌రుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాట‌ర్ల‌లో గ్లెన్ ఫిలిప్స్ (60 ; 50 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు.

  • 01 Nov 2023 08:34 PM (IST)

    నీష‌మ్ క్లీన్ బౌల్డ్..

    మ‌హ‌రాజ్ బౌలింగ్‌లో నీష‌మ్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 26.4వ ఓవ‌ర్‌లో 110 ప‌రుగుల వ‌ద్ద న్యూజిలాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.

  • 01 Nov 2023 08:24 PM (IST)

    సౌతీ ఔట్‌

    మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో సౌతీ (7) ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో కివీస్ 109 ప‌రుగుల వ‌ద్ద ఏడో వికెట్ కోల్పోయింది. అంత‌క‌ముందు మిచెల్ సాంట్న‌ర్ (7)ను కేశ‌వ్ మ‌హ‌రాజ్ పెవిలియ‌న్‌కు పంపాడు.

  • 01 Nov 2023 07:46 PM (IST)

    కష్టాల్లో కివీస్.. 5 వికెట్లు డౌన్

    90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. డెవాన్ కాన్వే 2, విల్ యంగ్ 33, రచిన్ రవీంద్ర 9, టామ్ లాథమ్ 4, డారిల్ మిచెల్ 24 పరుగులు చేసి అవుటయ్యారు.

  • 01 Nov 2023 06:43 PM (IST)

    కివీస్ కు ఆరంభంలోనే షాక్

    భారీ టార్గెట్ తో బరిలోకి న్యూజిలాండ్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 2 పరుగులు చేసి మార్కో జాన్సెన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 7 ఓవర్లలో 28/1 స్కోరుతో కివీస్ ఆట కొనసాగిస్తోంది. విల్ యంగ్ 17, రచిన్ రవీంద్ర 4 పరుగులతో ఆడుతున్నారు.

  • 01 Nov 2023 05:56 PM (IST)

    న్యూజిలాండ్ కు సౌతాఫ్రికా భారీ టార్గెట్

    న్యూజిలాండ్ కు సౌతాఫ్రికా 358 పరుగుల టార్గెట్ పెట్టింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. డికాక్ (114; 116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు), డస్పెన్ (133; 118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలతో దుమ్మురేపారు. మిల్లర్ చివర్లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 53 పరుగులు చేసి నాలుగో వికెట్ గా అవుటయ్యాడు. బావుమా 24 పరుగులు చేశాడు. క్లాసెన్(15), మార్క్రామ్(6) నాటౌట్ గా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌతీ 2 వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్, నీషమ్ చెరో వికెట్ తీశారు.

  • 01 Nov 2023 05:43 PM (IST)

    డస్సెన్ అవుట్.. మూడో వికెట్ డౌన్

    47.1 ఓవర్ లో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 133 పరుగులు చేసి సౌతీ బౌలింగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 48 ఓవర్లలో 325/3 స్కోరుతో సౌతాఫ్రికా ఆట కొనసాగిస్తోంది.

  • 01 Nov 2023 05:18 PM (IST)

    డస్సెన్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా సౌతాఫ్రికా

    రాస్సీ వాన్ డెర్ డస్సెన్ సెంచరీ సాధించాడు. డికాక్ తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన అతడు 101 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. అతడికి తోడుగా మిల్లర్ (6) క్రీజ్ లో ఉన్నాడు. 46 ఓవర్లలో 308/2 స్కోరుతో సౌతాఫ్రికా ఆట కొనసాగిస్తోంది.

     

  • 01 Nov 2023 05:07 PM (IST)

    డికాక్ అవుట్.. కీలక భాగస్వామానికి చెక్

    సెంచరీ హీరో డికాక్ అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. డస్సెన్ తో కలిసి రెండో వికెట్ 192 బంతుల్లో 200 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేశాడు డికాక్. 116 బంతుల్లో 114 పరుగులు చేసి సౌతీ బౌలింగ్ లో అవుటయ్యాడు. 40 ఓవర్లలో 238/2 స్కోరుతో సౌతాఫ్రికా ఆట కొనసాగిస్తోంది.

  • 01 Nov 2023 04:45 PM (IST)

    దుమ్ము రేపిన డికాక్.. సిక్సర్ తో సెంచరీ

    దక్షిణాఫ్రికా డాషింగ్ ఓపెనర్ డికాక్ దుమ్ము రేపుతున్నాడు. ఈ ప్రపంచకప్ లో నాలుగో సెంచరీ బాదాడు. 103 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ కంప్లీట్ చేశాడు. అతడికి తోడుగా డస్సెన్ క్రీజ్ లో ఉన్నాడు. అతడికి తోడుగా డస్సెన్ (74) క్రీజ్ లో ఉన్నాడు. 36 ఓవర్లలో 205/1 స్కోరుతో సౌతాఫ్రికా ఆట కొనసాగిస్తోంది.

     

  • 01 Nov 2023 04:14 PM (IST)

    కివీస్ 15, సఫారీ 15

    ఈ ప్రపంచకప్ లో వ్యక్తిగత 50 ప్లస్ స్కోర్లు అత్యధికంగా నమోదు చేసిన జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. కివీస్ బ్యాటర్లు 15 సార్లు 50+ స్కోర్లు చేయగా.. తాజాగా డస్సెన్ హాఫ్ సెంచరీ కొట్టడంతో దక్షిణాఫ్రికా ఈ ఫీట్ సాధించింది. అయితే ఈ రోజు మ్యాచ్ లో న్యూజిలాండ్ సెకండ్ బ్యాటింగ్ చేయనుంది. పాకిస్థాన్(13), శ్రీలంక(12) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

  • 01 Nov 2023 04:07 PM (IST)

    డస్సెన్ హాఫ్ సెంచరీ

    రాస్సీ వాన్ డెర్ డస్సెన్ హాఫ్ సెంచరీ కొట్టాడు. 61 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. 29 ఓవర్లలో 154/1 స్కోరుతో సౌతాఫ్రికా ఆట కొనసాగిస్తోంది.
    డికాక్ 72 పరుగులతో ఆడుతున్నాడు.

  • 01 Nov 2023 03:49 PM (IST)

    25 ఓవర్లలో 124/1

    మొదట్లో నెమ్మెదిగా ఆడిన దక్షిణాఫ్రికా వేగం పెంచింది. 25 ఓవర్లలో 124/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. క్వింటన్ డికాక్ 57, డస్సెన్ 36 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. చేతిలో ఇంకా 9 వికెట్లు ఉన్నాయి కాబట్టి సౌతాఫ్రికా భారీ స్కోరు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

  • 01 Nov 2023 03:31 PM (IST)

    డికాక్ హాఫ్ సెంచరీ.. దంచుడు షురూ

    వన్డే ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా డాషింగ్ ఓపెనర్ డికాక్ హవా కొనసాగుతోంది. ఇప్పటికే టాప్ స్కోరర్ గా కొనసాగుతున్న అతడు తాజాగా హాఫ్ సెంచరీ బాదాడు. 62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధశతకం బాదాడు. పవర్ ప్లేలో నెమ్మదిగా ఆడిన డికాక్ తర్వాత గేర్ మర్చాడు. పరిస్థితులకు తగ్గట్టు ఆడుతూ హాఫ్ సెంచరీ చేశాడు.

     

  • 01 Nov 2023 03:26 PM (IST)

    నిలకడగా బ్యాటింగ్ చేస్తోన్న దక్షిణాఫ్రికా

    దక్షిణాఫ్రికా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. డికాక్ 45, డస్సెన్ 20 పరుగులతో ఆడుతున్నారు. టెంబా బావుమా 24 పరుగులు చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో తొలి వికెట్ గా అవుటయ్యాడు.

  • 01 Nov 2023 02:59 PM (IST)

    డికాక్ స్లో బ్యాటింగ్

    దక్షిణాఫ్రికా డాషింగ్ ఓపెనర్ డికాక్ నెమ్మదిగా ఆడుతున్నాడు. ఫస్ట్ బాల్ నుంచే బౌలర్లపై విరుచుకుపడే అతడు ఈరోజు మ్యాచ్ లో తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో భీకరంగా ఆడే అతడు ఫస్ట్ 10 ఓవర్లలో కేవలం ఒక్క ఫోర్ మాత్రమే కొట్టాడు. పవర్ ప్లే 25 బంతులు ఎదుర్కొని 13 పరుగులు మాత్రమే చేశాడు. ముందు స్లోగా ఆడి తర్వాత స్పీడ్ పెంచుతాడేమో చూడాలి.

  • 01 Nov 2023 02:48 PM (IST)

    బావుమా అవుట్.. ఫస్ట్ వికెట్ డౌన్

    8.3 ఓవర్లలో 38 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా తొలి వికెట్ నష్టపోయింది. కెప్టెన్ టెంబా బావుమా 24 పరుగులు చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో అవుటయ్యాడు. దక్షిణాఫ్రికా 10 ఓవర్లలో 43/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. డికాక్ 14, డస్సెన్ 4 పరుగులతో ఆడుతున్నారు.

  • 01 Nov 2023 02:21 PM (IST)

    5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 15/0

    టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా పరుగులు చేసింది. డికాక్ 4, బావుమా 10 పరుగులతో ఆడుతున్నారు.

  • 01 Nov 2023 02:04 PM (IST)

    సఫారీ టీమ్ భారీ స్కోరు చేస్తుందా?

    వన్డేల్లో దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసిన గత ఏడు మ్యాచుల్లోనూ భారీ స్కోరు సాధించింది. ఈరోజు మ్యాచ్ లోనూ భారీ స్కోరు చేస్తుందా, లేదా చూడాలి. ప్రస్తుతం జట్టు ఫామ్ ప్రకారం చూస్తే సఫారీ టీమ్ భారీ స్కోరు చేయడానికి ఫుల్ చాన్స్ ఉంది. ముఖ్యంగా ఓపెనర్ డికాక్ బ్యాట్ తో దుమ్మరేపుతున్నాడు.

    గత ఏడు మ్యాచుల్లో సౌతాఫ్రికా స్కోర్లు
    338/6 vs AUS
    416/5 vs AUS
    315/9 vs AUS
    428/5 vs SL
    311/7 vs AUS
    399/7 vs ENG
    382/5 vs BAN

  • 01 Nov 2023 01:49 PM (IST)

    తుది జట్లు

    దక్షిణాఫ్రికా : క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి
    ఎన్గిడి

    న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్/వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్

  • 01 Nov 2023 01:36 PM (IST)

    టాస్ గెలిచిన న్యూజిలాండ్

    న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్.. దక్షిణాఫ్రికాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

     

    NZ vs SA: వన్డే ప్రపంచకప్ లో మరో కీలక సమరానికి నేడు రంగం సిద్ధమైంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. 10 పాయింట్లతో సౌతాఫ్రికా రెండో స్థానంలో ఉండగా, 8 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. ఈరోజు మ్యాచ్ లో విజయం సాధించి సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

    విలియమ్సన్ దూరం
    గాయం కారణంగా న్యూజిలాండ్ రెగ్యులర్ కేన్ విలియమ్సన్ ఈరోజు మ్యాచ్ కూడా దూరం అయ్యాడు. పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ నాటిని అతడు పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని కివీస్ టీమ్ వెల్లడించింది.