T20 World Cup: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్.. ప్లే ఆఫ్‌కు పోటీ పడే జట్టు ఇవే.. ఎమిరేట్స్, ఒమన్‌లలో మ్యాచ్‌లు

ఇంటర్నేషనల్ క్రికెట్ కంట్రోల్ బోర్డు పురుషుల టీ20 ప్రపంచ కప్.. భారతదేశానికి బదులుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) మరియు ఒమన్‌లలో జరగనుంది.

ICC Men’s T20 World Cup: ఇంటర్నేషనల్ క్రికెట్ కంట్రోల్ బోర్డు పురుషుల టీ20 ప్రపంచ కప్.. భారతదేశానికి బదులుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) మరియు ఒమన్‌లలో జరగనుంది. ఈ టోర్నమెంట్ అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 14వ తేదీన జరగబోతుంది. ఈ టోర్నమెంట్‌ను ఈ ఏడాది భారతదేశంలో నిర్వహించాల్సి ఉండగా.., కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ కార్యక్రమానికి BCCI ఆతిథ్యం ఇస్తుండగా.. టోర్నమెంట్‌లో అన్ని మ్యాచ్‌లు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం, షార్జా స్టేడియం మరియు ఒమన్ క్రికెట్ స్టేడియంలలో జరగనున్నాయి. ఎనిమిది క్వాలిఫైయింగ్ జట్లతో కూడిన ఈ టోర్నమెంట్ మొదటి రౌండ్ ఒమన్ మరియు యూఏఈల్లో జరిపేందుకు విభజించారు. ఈ నాలుగు జట్లు సూపర్ 12 రౌండ్‌కు చేరుకుంటాయి. ఇప్పటికే ఎనిమిది జట్లు అర్హత సాధించగా.. 2016లో భారతదేశంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ఇంగ్లాండ్‌ను ఓడించగా.. తర్వాత ఆడే మొదటి పురుషుల టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ఇదే అవుతుంది.

ఈ టోర్నమెంట్‌లో ప్లేఆఫ్ దశకు ముందు ప్రాథమిక రౌండ్‌లో ఒకరితో ఒకరు తలపడే జట్లలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్, పాపువా న్యూ గినియా ఉన్నాయి. ఈ టోర్నమెంట్‌ను భారతదేశం నుంచి బదిలీ చేసినట్లు ప్రకటించిన తరువాత, ఐసీసీ సీఈఓ జియోఫ్ అలార్డైస్ మాట్లాడుతూ, ఐసిసి పురుషుల టీ20 ప్రపంచకప్ 2021ను సురక్షితమైన పద్ధతిలో నిర్వహించడం మా ప్రాధాన్యత. దీన్ని భారతదేశంలో నిర్వహించలేక పోవడం చాలా నిరాశకు గురిచేస్తోంది.

ప్రస్తుత పరిస్థితిలో ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, మేము పూర్తిగా సురక్షితమైన దేశంలో దీన్ని పూర్తి చేయాలి. అద్భుతమైన ఈ వేడుకను అభిమానులు పూర్తిగా ఆస్వాదించగలిగేలా మేము బీసీసీఐ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు మరియు ఒమన్ క్రికెట్లతో కలిసి పని చేస్తామని అన్నారు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2021 టోర్నమెంట్‌ను యూఏఈ, ఒమన్‌లో నిర్వహించడానికి బీసీసీఐ ఎదురుచూస్తున్నట్లు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు