Pic Courtesy@EspnCricInfo
ICC Mens T20 World Cup 2026: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్ లో న్యూజిలాండ్ పై అద్భుత విజయంతో వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. 96 పరుగుల తేడాతో కివీస్ ను చిత్తు చేసింది భారత్. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. 256 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచి భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. కొత్త కొత్త రికార్డులు నెలకొల్పింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ విజేతగా నిలవడం ఇది ముచ్చటగా మూడోసారి. తొలిసారి 2007లో (ఫస్ట్ ఎడిషన్ ధోని కెపెన్సీలో), రెండోసారి 2024లో (రోహిత్ శర్మ కెప్టెన్సీలో), ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 2026లో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ గెలుపుతో తొలిసారి ‘ట్రిపుల్’ సాధించిన జట్టుగా టీమిండియా రికార్డ్ నెలకొల్పింది. అంతేకాదు సొంతగడ్డపై నెగ్గిన తొలి టీమ్‌గా కొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ (2024, 2026) సాధించిన జట్టుగా కూడా భారత్ హిస్టరీ క్రియేట్ చేసింది.