new Power Play overs rules for shortened T20s
టీ20 మ్యాచ్‌లకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ ధనాధన్ ఆటను చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. పొట్టి ఫార్మాట్‌లో ప్రతి బంతి కూడా ఎంతో ముఖ్యం అన్న సంగతి తెలిసిందే. అలాంటిది.. వర్షం కారణంగా మ్యాచ్‌ను కుదించాల్సి వచ్చినప్పుడు ప్రతీసారి ఓ గందరగోళం ఉండేది. పవర్ ప్లే ఎన్ని ఓవర్లు ఉండాలి ?
బంతి బంతికి మ్యాచ్ గమనం మారిపోయే పొట్టి ఫార్మాట్‌లో వరుణుడి కారణంగా పవర్ ప్లే ఓవర్ల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండేవి. ఈ క్రమంలో ఐసీసీ టీ20ల్లో పవర్ ప్లే విషయంలో ఓ కొత్త రూల్‌ను తీసుకువచ్చింది.
గతంలో వర్షం కారణంగా ఓవర్ల సంఖ్య కుదించినప్పుడు.. ఇన్నింగ్స్‌లో పవర్ ప్లేను ఓవర్ల ప్రామాణికంగానే నిర్ణయించేవారు. కానీ ఇప్పటి నుంచి బంతులను ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఉదాహరణకు వర్షం కారణంగా 5 ఓవర్లకు మ్యాచ్‌కు కుదిస్తే.. ఇప్పుడు 1.3 ఓవర్లు మాత్రమే పవర్ ప్లే ఉంటుంది. కానీ గతంలో మాత్రం దీన్ని 2 ఓవర్లుగా ఉండేది.
Team india : ఇదేం ఆట.. టీమ్ఇండియా ప్లేయర్ల ఆటతీరుపై మండిపడిన సునీల్ గవాస్కర్..
ఇదే విధంగా ఆరు ఓవర్లు అయితే.. 1.5, 7 ఓవర్లు అయితే 2.1 ఇలా.. 19 ఓవర్లు అయితే 5.4 ఓవర్లు పవర్ ప్లే ఉంటుంది. ఓవర్ల మధ్య పవర్ ప్లే పూర్తి అయినా కూడా ఎలాంటి సమస్య ఉండదని చెబుతోంది. పవర్ ప్లేలో 30 గజాల సర్కిల్ వెలుపల ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉంటారన్న సంగతి తెలిసిందే.
వైడ్ నిబంధనలోనూ మార్పు..
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వైడ్ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. లెగ్‌సైడ్ బంతి కాస్త వెళ్లినా చాలు అంపైర్లు వైడ్ ఇస్తూ ఉంటారు. ఇక క్రీజులో ఉన్న బ్యాటర్ ఆప్ సైడ్ ముందుకు కదిలినప్పుడు వైడ్ లైన్‌ను దాటి బంతి వేసినా వైడ్ ఇవ్వట్లేదు. బ్యాటర్ షాట్ ఆడేటప్పుడు, అతడికి, బంతికి మధ్య దూరాన్ని బట్టే అంపైర్ వైడా కాదా అన్నది నిర్ణయిస్తూ ఉంటారు. అయితే.. ఇక పై బౌలర్ బంతిని విడుదల చేసేటప్పుడు బ్యాటర్ కాళ్లు ఎక్కడ ఉన్నాయన్నదే పరిగణలోకి ఉంటారు. ఈ నిబంధన శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జూలై 2 నుంచి జరగనున్న వన్డే సిరీస్‌తో అమల్లోకి రానుంది.