×
Ad

ICC ODI World Cup 2023: మరో వంద రోజుల్లో ప్రపంచ క్రికెట్ కప్ 2023 పోటీలు

ప్రపంచ క్రికెట్ కప్ 2023 పోటీలు సరిగ్గా మరో 100 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఐసీసీ ఓడీఐ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు ఈ ఏడాది అక్టోబర్ 5వతేదీన ప్రారంభం కానున్నాయి.....

  • Published On : June 27, 2023 / 12:04 PM IST

ICC ODI World Cup

ICC ODI World Cup 2023 Schedule : ప్రపంచ క్రికెట్ కప్ 2023 పోటీలు సరిగ్గా మరో 100 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఐసీసీ ఓడీఐ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023 కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5వతేదీ నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. భారత్ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తుంది. ప్రపంచ కప్ కోసం ఇప్పటికే బీసీసీఐ డ్రాప్ట్ షెడ్యూల్ ను విడుదల చేసింది. ముసాయిదా షెడ్యూల్ ప్రకారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 15న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మధ్య అత్యంత ముఖ్యమైన పోరు జరగనుంది. ఈ ప్రపంచ కప్ లో భారత్-పాక్ జట్ల మధ్య జరిగే పోరుపై భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Lawrence Bishnoi : ఎన్ఐఏ కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సంచలన వ్యాఖ్యలు

ముంబయిలో నివాసం ఉంటున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వాంఖడే స్టేడియంలో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ‘‘వ్యక్తిగతంగా నేను ఈ ప్రపంచకప్‌ ముంబైలో ఆడాలని ఎదురు చూస్తున్నాను. ఆ వాతావరణాన్ని మళ్లీ అనుభవించడం చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు స్వదేశంలో ప్రపంచకప్ ఆడటం వల్ల క్రీడాభిమానులు ఎంత ఉత్సాహంగా ఉన్నారో నేను అర్థం చేసుకోగలను’’ అని కోహ్లీ చెప్పారు.

wanted criminal shot dead : యూపీలో వాంటెడ్ క్రిమినల్ ఎన్‌కౌంటర్

క్రికెట్ వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ ను బీసీసీఐ సెక్రటరీ జైషా, టీం ఇండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్, శ్రీలంక మాజీ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ లు మరికొద్దీ సేపట్లో  ప్రకటించనున్నారు. ముంబయి నగరంలోని సెయింట్ రేగిస్ హోటల్ లో ఈ షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేయనున్నారు. ప్రపంచ కప్ 2023 ట్రోఫీ రాబోయే 100 రోజుల్లో 18 వేర్వేరు దేశాలకు వెళ్లనుంది. భారత్‌, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పపువా న్యూ గినియా, యూఎస్ఏ, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, కువైట్, బహ్రెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, మలేషియా, ఉగాండా, నైజీరియా, దక్షిణాఫ్రికా దేశాల్లో ట్రోఫీ తిరగనుంది.