ICC Photoshopped Dhoni, Lasith Malinga : మలింగా హెయిర్ స్టైల్లో ధోనీ.. ఐసీసీని ఏకిపారేసిన నెటిజన్లు..!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, శ్రీలంక పేసర్ లసిత్ మలింగాలను ఒకే క్రికేటర్ గా ఫొటోషాపు చేసింది ఐసీసీ. ధోనీ అభిమానులంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫొటోను ట్విట్టర్ నుంచి డిలీట్ చేయాలంటూ కామెంట్లతో ఏకిపారేస్తున్నారు.

Icc Photoshopped Dhoni, Lasith Malinga Into One Cricketer (2)

ICC Photoshopped Dhoni, Lasith Malinga : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, శ్రీలంక పేసర్ లసిత్ మలింగాలను ఒకే క్రికేటర్ గా ఫొటోషాపు చేసింది ఐసీసీ. దీనిపై ధోనీ అభిమానులు సహా నెటిజన్లంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ ఫొటోను ట్విట్టర్ హ్యాండిల్ నుంచి డిలీట్ చేయాలంటూ కామెంట్లతో ఐసీసీని ఏకిపారేస్తున్నారు. ఒకప్పుడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీకి సరిగ్గా 10 ఏళ్లు అవుతుంది.


ధోనీ సారథ్యంలో అప్పటి భారత జట్టు ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 19, 2011న ప్రారంభమైన ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఏప్రిల్ 2, 2011న జరిగింది. చివరికి ఫైనల్లో శ్రీలంకను భారత్ ఓడించింది. ధోని తనదైన స్టెయిల్‌లో మ్యాచ్ ఫినీషర్‌గా ఆట ముగించాడు.1983లో కపిల్ దేవ్ భారత్ కు ప్రపంచ కప్ అందించాడు. కపిల్ తర్వాత ధోనీ సారథ్యంలో 28 ఏళ్ల తరువాత ప్రపంచకప్ ఇండియాకు దక్కింది.


టోర్నమెంట్ జరిగి 10 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ట్విట్టర్ హ్యాండిల్ (@cricketworldcup) క్రికెట్‌వరల్డ్‌కప్ 2011 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ దక్కించుకున్న క్షణం చిరస్మరణీయమైనదిగా చెప్పవచ్చు. ఆ రోజులను మళ్లీ గుర్తుచేసుకుంటూ ట్విట్టర్ హ్యాండిల్ ధోనీ, మలింగ ఫొటోలను ఒకే క్రికేటర్‌గా ఫొటోషాపు చేసింది. మార్ఫింగ్ చేసిన తర్వాత వారిద్దరి ఫొటో ఇలా కనిపిస్తోంది.


మలింగ జుట్టు, ధోనీ ముఖంతో కలిగిన ఫొటోను షేర్ చేసింది. యార్కర్ల వేయడం, స్లిప్ క్యాచ్‌లు, హెలికాప్టర్ షాట్లు కొట్టడం అన్నీ చేయగలడు…ధోనీ ముఖం ఎంఎస్ మలింగ హెయిర్ స్టయిల్‌తో కనిపిస్తున్నాడు. ఈ ఫొటోను చూసిన ధోనీ అభిమానులు, ట్విట్టర్ యూజర్లంతా ఫన్నీ కామెంట్లతో ఏకిపారేస్తున్నారు. ముందు ఆ ఫొటోను వెంటనే డిలీట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.


ప్రపంచంలో ఇక మిగిలిందేమి లేదు. ట్వీట్ చేయడానికి ఏమి లేదు.. వెంటనే ఈ ఫొటో డిలీట్ చేయండి.. లోకంలో ఏ కంటెంట్ దొరకలేదేమో..ఇదంతా అనవసరం? అంటూ ధోనీ ఫ్యాన్స్, నెటిజన్లు ఐసీసీని ఏకిపారేస్తున్నారు.