Test Rankings
ICC Test Rankings: మరోసారి టీమిండియా ప్రథమ స్థానాన్ని చేరుకోగలిగింది. న్యూజిలాండ్ పై భారత్ సాధించిన ఘన విజయం తర్వాత 3వేల 465పాయింట్లతో టాప్ 1కు చేరుకుంది. మొత్తం 28మ్యాచ్ లు ఆడిన ఇండియా మొదటి స్థానంలో ఉండగా.. టాప్ 10లో జింబాబ్వే 342 పాయింట్లతో నిలిచింది.
ఇండియా తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్ (3021 పాయింట్లు), ఆస్ట్రేలియా (1844 పాయింట్లు), ఇంగ్లాండ్ (3753 పాయింట్లు), పాకిస్తాన్ (2481 పాయింట్లు), దక్షిణాఫ్రికా (1675 పాయింట్లు), శ్రీలంక (2485 పాయింట్లు), వెస్టిండీస్ (2480 పాయింట్లు), బంగ్లాదేశ్ (779 పాయింట్లు), జింబాబ్వే (342 పాయింట్లు)తో నిలిచాయి.
సొంతగడ్డపై వరుసగా 14వ విజయం నమోదు చేసింది టీమిండియా. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 11వ టెస్టు సిరీస్ విజయం దక్కింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ పై బెంచ్ ప్లేయర్లను వాడి గెలిచేశారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, బుమ్రా, షమీలు సిరీస్ మిస్ అయినప్పటికీ గెలుపు మనదే కావడం విశేషం. మొదటి టెస్టులో విజయం అంచులవరకూ వచ్చి డ్రా గా ముగించినా.. రెండో టెస్టును మాత్రం రికార్డుల హోరుతో ముగించిన టీమిండియా.. సిరీస్ దక్కించుకుంది.
………………………… : ఎమ్మెల్యేల ఇళ్లలో దొంగతనానికి యత్నం-చెడ్డీ గ్యాంగ్ పనేనా ?