ICC Test Rankings : టాప్‌-10లోకి దూసుకొచ్చిన య‌శ‌స్వి జైస్వాల్‌.. జాబితాలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఎక్క‌డున్నాడంటే?

ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ దుమ్ములేపుతున్నాడు.

ICC Test Rankings Yashasvi Jaiswal enters Top 10

ICC Test Rankings : ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ దుమ్ములేపుతున్నాడు. అంత‌ర్జాతీయ‌ క్రికెట్ కౌన్సిల్ తాజాగా విడుద‌ల చేసిన టెస్టు బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో య‌శ‌స్వి టాప్‌-10లోకి దూసుకువ‌చ్చాడు. రెండు స్థానాలు మెరుగుప‌ర‌చుకుని 10వ స్థానంలో నిలిచాడు. అటు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సైతం రెండు స్థానాలు మెరుగుప‌ర‌చుకుని 11వ స్థానానికి చేరుకున్నాడు.

ఇక ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడ‌నప్ప‌టికీ కూడా విరాట్ కోహ్లి టాప్‌-10లోనే కొన‌సాగుతున్నాడు. 744 రేటింగ్ పాయింట్ల‌తో ఎనిమిదిలో స్థానంలో ఉన్నాడు. ఇక ఎప్ప‌టిలాగానే న్యూజిలాండ్ స్టార్ బ్యాట‌ర్ కేన్ విలియ‌మ్స‌న్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత వ‌రుస‌గా జో రూట్‌, స్టీవ్ స్మిత్‌, డారిల్ మిచెల్‌, బాబ‌ర్ ఆజామ్‌లు వ‌రుస‌గా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

టెస్టు బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌..

1. కేన్ విలియ‌మ్స‌న్ (న్యూజిలాండ్‌) – 870 రేటింగ్ పాయింట్లు
2. జో రూట్ (ఇంగ్లాండ్‌) – 799
3. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 789
4. డారిల్ మిచెల్ (న్యూజిలాండ్‌) – 771
5. బాబ‌ర్ ఆజాం (పాకిస్తాన్‌) – 768
6. ఉస్మాన్ ఖ‌వాజా (ఆస్ట్రేలియా) – 755
7. క‌రుణ‌ర‌త్నె (శ్రీలంక‌) – 750
8. విరాట్ కోహ్లి (భార‌త్‌) – 744
9. హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) – 743
10. య‌శ‌స్వి జైస్వాల్ (భార‌త్‌) – 727
11. రోహిత్ శ‌ర్మ (భార‌త్) – 720

స‌స్పెన్స్ వీడింది.. ధోని కొత్త పాత్ర ఏంటో తెలిసిపోయింది.. ద్విపాత్రాభిన‌యం

ఇక బౌల‌ర్ల ర్యాంకింగ్స్ విష‌యానికి వ‌స్తే.. టీమ్ఇండియా బౌల‌ర్లు జ‌స్‌ప్రీత్ బుమ్రా, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌లు తొలి రెండు స్థానాల్లోనే కొన‌సాగుతున్నారు. ఆ త‌రువాత ర‌బాడ‌, హేజిల్ వుడ్‌, పాట్ కమిన్స్ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. కివీస్‌తో మొద‌టి టెస్ట్‌లో 10 వికెట్లు తీసిన‌ నాథన్‌ లయోన్‌ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగ‌బాకాడు.

టెస్టు బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌..

1. జ‌స్‌ప్రీత్ బుమ్రా (భార‌త్) – 867
2. ర‌విచంద్ర‌న్ అశ్విన్ (భార‌త్‌) – 846
3. క‌గిసో ర‌బాడ (ద‌క్షిణాఫ్రికా) – 834
4. హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 822
5. పాట్ క‌మిన్స్ (ఆస్ట్రేలియా) – 811

ఇక ఆల్‌రౌండర్స్‌ ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే దాదాపుగా ఎటువంటి మార్పులు లేవు. రవీంద్ర జడేజా, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, షకీబ్ అల్ హసన్, జో రూట్‌, అక్షర్‌ పటేల్‌, జేసన్‌ హోల్డర్‌, బెన్ స్టోక్స్‌లు టాప్‌-7లో కొన‌సాగుతున్నారు.

Sachin Tendulkar : ఇషాన్, శ్రేయ‌స్‌ల‌ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ ర‌ద్దు.. స‌చిన్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌.. నేనైతేనా..

ట్రెండింగ్ వార్తలు