Sachin Tendulkar : ఇషాన్, శ్రేయ‌స్‌ల‌ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ ర‌ద్దు.. స‌చిన్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌.. నేనైతేనా..

దేశ‌వాళీ క్రికెట్ టోర్నీల‌కు స‌మ ప్రాధాన్యం క‌ల్పిస్తూ ఇటీవ‌ల భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు

Sachin Tendulkar : ఇషాన్, శ్రేయ‌స్‌ల‌ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ ర‌ద్దు.. స‌చిన్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌.. నేనైతేనా..

Sachin Intriguing Ranji Trophy Remark Amid Ishan, Shreyas Contract Saga

దేశ‌వాళీ క్రికెట్ టోర్నీల‌కు స‌మ ప్రాధాన్యం క‌ల్పిస్తూ ఇటీవ‌ల భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. స్టార్ క్రికెట‌ర్లు ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ ఆడ‌డం వ‌ల్ల డొమెస్టిక్ టోర్నీల‌కు మ‌రింత ఆద‌ర‌ణ పెరుగుతుంద‌ని చెప్పుకొచ్చాడు. తాను క్రికెట్ ఆడే రోజుల్లో త‌న‌కు ఏ మాత్రం అవ‌కాశం దొరికినా కానీ.. ముంబై జ‌ట్టు త‌రుపున ఆడేందుకు ఎంతో ఇష్ట‌ప‌డేవాడిన‌ని గుర్తు చేసుకున్నాడు.

రంజీట్రోఫీలో ముంబై జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకుంది. ఈ క్ర‌మంలో ముంబై జ‌ట్టును అభినందిస్తూనే ఇటీవ‌ల బీసీసీఐ తీసుకున్న నిర్ణ‌యాల‌పై స‌చిన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. ‘రంజీ ట్రోఫీ సెమీఫైన‌ల్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. ముఖ్యంగా ముంబై జ‌ట్టు ప‌డిలేచిన కెర‌టంలా సెమీస్‌కు దూసుకువ‌చ్చింది. మ‌రో సెమీఫైన‌ల్ మ్యాచ్ ఆఖ‌రి రోజు వ‌ర‌కు సాగడం ఆనందం క‌లిగిస్తోంది.’ అని స‌చిన్ అన్నారు.

Ashwin : వందో టెస్టు ఆడ‌బోతున్న అశ్విన్‌.. తండ్రి, త‌ల్లి, భార్య‌, పిల్ల‌ల గురించి ఏం చెప్పాడంటే ?

కాగా.. ‘నా కెరీర్‌లో అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు ఖ‌చ్చితంగా ముంబై త‌రుపున ఆడేవాడిని. అక్క‌డి డ్రెస్సింగ్ రూమ్‌లో 7 నుంచి 8 మంది జాతీయ జ‌ట్టుకు ఆడే క్రికెట్ల‌రు ఉండేవారు. వారితో క‌లిసి ఆడ‌డం ఎంతో స‌ర‌దాగా ఉండేది. భార‌త జ‌ట్టులోని ఆట‌గాళ్లు దేశ‌వాళీ క్రికెట్‌లో ఆడితే ఆయా టోర్నీల‌కు ఆద‌ర‌ణ పెర‌గుతుంది. అంతేకాకుండా యువ ఆట‌గాళ్లను మ‌రింత రాటుదేలేలా చేస్తోంది. కొన్ని సార్లు కొత్త ప్ర‌తిభ బ‌య‌ట‌కు వ‌స్తుంది. అంతేకాదు ఫామ్‌లేమితో ఇబ్బంది పడేవాళ్లు వాళ్లు తిరిగి బేసిక్స్‌ నుంచి మొదలుపెట్టి పొరపాట్లను సరిచేసుకునే అవకాశం దొరుకుతుంది. నిజంగా దేశవాళీ క్రికెట్‌కు బీసీసీఐ స‌మ‌ ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది.’ అని స‌చిన్ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చాడు.

Virender Sehwag : సెహ్వాగ్ కాదా? సునీల్ గ‌వాస్క‌ర్ త‌రువాత అత్యుత్త‌మ ఓపెన‌ర్ ఎవ‌రంటే?

కాగా.. ఫిట్‌నెస్ కార‌ణాల‌తో ఇబ్బంది ప‌డే వారు మిన‌హా జాతీయ జ‌ట్టుకు ఆడే క్రికెట‌ర్లు అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు లేని స‌మ‌యంలో రంజీట్రోఫీలో ఆడాల‌ని ఇటీవ‌ల బీసీసీఐ నిబంధ‌న‌ను తీసుకువ‌చ్చింది. అయితే.. ఈ నిబంధ‌న‌ను శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌లు ప‌ట్టించుకోలేదు. దీంతో వారిద్ద‌రిపై బీసీసీఐ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ నేప‌థ్యంలో 2023-2024 ఏడాదికి ప్ర‌క‌టించిన సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ జాబితాలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌ల‌కు చోటు ఇవ్వ‌లేదు.