Virender Sehwag : సెహ్వాగ్ కాదా? సునీల్ గ‌వాస్క‌ర్ త‌రువాత అత్యుత్త‌మ ఓపెన‌ర్ ఎవ‌రంటే?

లిటిల్ మాస్ట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ అత్యుత్త‌మ ఓపెన‌ర్ అనేది కాన‌ద‌లేని వాస్త‌వం.

Virender Sehwag : సెహ్వాగ్ కాదా? సునీల్ గ‌వాస్క‌ర్ త‌రువాత అత్యుత్త‌మ ఓపెన‌ర్ ఎవ‌రంటే?

Shastri says Murali Vijay is India's best Test opener after Gavaskar Not Sehwag

Virender Sehwag – Murali Vijay : టీమ్ఇండియా తరుపున ఎంతో మంది క్రికెట్ ఆడారు. వారిలో లిటిల్ మాస్ట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ అత్యుత్త‌మ ఓపెన‌ర్ అనేది కాన‌ద‌లేని వాస్త‌వం. సుదీర్ఘ ఫార్మాట్‌లో 10 వేల ప‌రుగులు చేసిన తొలి భార‌త బ్యాట‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. అంతేకాకుండా టెస్టుల్లో 34 సెంచ‌రీలు చేసిన మొద‌టి ఆట‌గాడిగా నిలిచాడు. జెఫ్ థామ్సన్, డెన్నిస్ లిల్లీ, ఆండీ రాబర్ట్స్, మాల్కం మార్షల్ వంటి భీక‌ర ఫాస్ట్ బౌల‌ర్ల‌ను హెల్మెట్ లేకుండానే ఎదుర్కొని ప‌రుగులు సాధించ‌డమే గ‌వాస్క‌ర్‌ని అత్యుత్త‌మ ఓపెన‌ర్ గా నిలిపింది.

గ‌వాస్క‌ర్ త‌రువాత రెండో స్థానంలో ఉండేది ఎవ‌రు అనే ప్ర‌శ్న వ‌స్తే.. ముందుగా అంద‌రికి గుర్తుకు వ‌చ్చే వీరేంద్ర సెహ్వాగ్‌. రెండు ట్రిపుల్ సెంచ‌రీలు చేయ‌డంతో పాటు 49.3 స‌గ‌టుతో 8596 ప‌రుగులు చేశాడు. ఇందులో 23 సెంచ‌రీలు ఉన్నాయి. అయితే.. టీమ్ఇండియా మాజీ కోచ్ ర‌విశాస్త్రి ప్ర‌కారం గ‌వాస్క‌ర్ త‌రువాత ముర‌ళీ విజ‌య్‌నే భార‌త అత్యుత్త‌మ టెస్టు ఓపెన‌ర్ అట‌. ఈ విష‌యాన్ని భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ వెల్ల‌డించారు.

Rohit Sharma : ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో ధ‌ర్మ‌శాల‌కు చేరుకున్న భార‌త కెప్టెన్‌

విజయ్‌ని చిన్నప్పటి నుంచి చూశాన‌ని, అత‌డిని మరో ఫస్ట్‌ డివిజన్‌ ​​టీమ్‌కి రికమెండ్‌ చేసింది తానేనని కూడా అరుణ్‌ చెప్పాడు. మాజీ సీఎస్‌కే స్టార్ తన అభిమాన ఆటగాళ్లలో ఒకడని అన్నాడు. “చిన్నప్పటి నుండి నాకు తెలిసిన ఒక వ్య‌క్తి పేరు చెప్పాలని మీరు కోరుకుంటే.. మురళీ విజయ్ నేను కాలేజీలో చూసిన వ్యక్తి. నేను అతనిని మరొక ఫస్ట్-డివిజన్ టీమ్‌కి సిఫార్సు చేసాను. అప్పుడే ప్రయాణం మొదలైంది. రవిశాస్త్రి తరచుగా చెప్పేవాడు. సునీల్ గవాస్కర్ తర్వాత మురళీ విజయ్ భారత్‌కు లభించిన అత్యుత్తమ టెస్టు ఓపెనర్ అని. అది గొప్ప అభినందన. నాకు ఇష్ట‌మైన ఆట‌గాళ్ల‌లో విజ‌య్ ఒక‌డు.” అని అరుణ్ తెలిపారు.

మురళీ విజయ్ భారతదేశం తరపున 61 టెస్టులు ఆడాడు. 38.3 స‌గ‌టుతో 3982 ప‌రుగులు చేశాడు. భార‌త ఓపెన‌ర్ల‌లో ఇది నాలుగో అత్య‌ధికం. టెస్టుల్లో విజ‌య్ అత్యుత్త‌మ స్కోరు 167 కాగా.. 12 సెంచ‌రీలు 15 హాఫ్ సెంచ‌రీలు చేశాడు. అతను చివరిసారిగా 2015లో జింబాబ్వేపై టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

Rohit Sharma : ఐదో టెస్టుకు ముందు కెప్టెన్ రోహిత్‌శ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డులు ఇవే..