Rohit Sharma : ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో ధ‌ర్మ‌శాల‌కు చేరుకున్న భార‌త కెప్టెన్‌

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భార‌త్ మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సొంతం చేసుకుంది.

Rohit Sharma : ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో ధ‌ర్మ‌శాల‌కు చేరుకున్న భార‌త కెప్టెన్‌

Rohit arrives in Dharamshala on a chopper ahead of 5th Test

Rohit Sharma – Dharamshala : ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భార‌త్ మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సొంతం చేసుకుంది. ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఐదో టెస్టుకు ముందు టీమ్ఇండియాకు వారం రోజుల విరామం ల‌భించింది. ఈ విరామంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న భార్య రితికాతో క‌లిసి వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ రెండో కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక‌కు హాజ‌రు అయ్యారు. ఆదివారం ఈ వేడుక ముగియ‌డంతో రోహిత్ వెంట‌నే ఐదో టెస్టు జ‌ర‌గ‌నున్న ధ‌ర్మ‌శాల‌కు వ‌చ్చేశాడు.

ఓ ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో అత‌డు ధ‌ర్మ‌శాల‌కు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మ్యాచ్‌కు మ‌రో రెండు రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌డంతో బీసీసీఐ హెలికాప్ట‌ర్‌ను ఏర్పాటు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ధ‌ర్మ‌శాల‌కు చేరుకున్న రోహిత్ జ‌ట్టుతో క‌లిశాడు. అనంత‌రం హెడ్‌కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌తో క‌లిసి ఐదో టెస్టు మ్యాచ్ పిచ్‌ను ప‌రిశీలించాడు.

Rohit Sharma : ఐదో టెస్టుకు ముందు కెప్టెన్ రోహిత్‌శ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డులు ఇవే..

మార్చి 7 గురువారం నుంచి భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఐదో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు చేరుకోవాలంటే ప్ర‌తి టెస్టు మ్యాచ్‌లోనూ గెల‌వ‌డం ఎంతో ముఖ్యం అన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 37.12 స‌గ‌టుతో 297 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ, ఓ హాఫ్ సెంచ‌రీ కూడా ఉంది.

బుమ్రా ఆగ‌యా..

రాంచీలో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న భార‌త పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా తిరిగి జ‌ట్టుతో చేరాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో మూడు టెస్టులు ఆడిన బుమ్రా 17 వికెట్లు తీశాడు. హైద‌రాబాద్ వేదికగా జ‌రిగిన తొలి టెస్టులో గాయ‌ప‌డిన కేఎల్ రాహుల్ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు.

5వ టెస్టు కోసం భార‌త జ‌ట్టు :

రోహిత్ శర్మ (కెప్టెన్‌), జ‌స్‌ప్రీత్‌ బుమ్రా (వైస్ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), కేఎస్‌ భరత్ (వికెట్ కీప‌ర్‌), దేవదత్ పడిక్కల్, ర‌విచంద్ర‌న్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మ‌హ్మ‌ద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.

WPL 2024 : డ‌బ్ల్యూపీఎల్‌లో డీఆర్ఎస్ వివాదం.. లెగ్ స్పిన్నర్ గూగ్లీగా!