Ashwin : వందో టెస్టు ఆడ‌బోతున్న అశ్విన్‌.. తండ్రి, త‌ల్లి, భార్య‌, పిల్ల‌ల గురించి ఏం చెప్పాడంటే ?

టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఓ అరుదైన మైలురాయి ముంగిట నిలిచాడు.

Ashwin : వందో టెస్టు ఆడ‌బోతున్న అశ్విన్‌.. తండ్రి, త‌ల్లి, భార్య‌, పిల్ల‌ల గురించి ఏం చెప్పాడంటే ?

Ahead Of 100th Test Ashwin Drops Brilliant Father Mother Wife Remark

Ravichandran Ashwin : టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఓ అరుదైన మైలురాయి ముంగిట నిలిచాడు. భార‌త జ‌ట్టు త‌రుపున ఇప్ప‌టి వ‌ర‌కు అశ్విన్ 99 టెస్టులు ఆడాడు. గురువారం (మార్చి 7) ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న ఐదో టెస్టు మ్యాచ్ అశ్విన్ కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్ కావ‌డం విశేషం. వందో టెస్టు మైలురాయిని అందుకున్న 14వ భార‌త ఆట‌గాడిగా అశ్విన్ నిల‌వ‌నున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు మీడియాతో మాట్లాడాడు.

వందో టెస్టు మ్యాచ్ గురించి మాట్లాడుతూ ఇది ఎంతో గొప్ప సంద‌ర్భం అని అన్నాడు. గ‌మ్యం కంటే కూడా ప్ర‌యాణం ఎంతో ప్ర‌త్యేక‌మైంద‌న్నాడు. 100వ టెస్ట్ త‌న‌కు చాలా ప్రాధాన్యమైనదని తెలిపాడు. త‌న‌కంటే తన తండ్రి, త‌ల్లి, భార్య‌, పిల్ల‌ల‌కు కూడా ఎంతో ముఖ్య‌మైన‌ద‌న్నాడు. ఈ టెస్టు మ్యాచ్ కోసం త‌న పిల్ల‌లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నార‌న్నాడు. ఓ ఆట‌గాడి ప్ర‌యాణంలో కుటుంబాల మ‌ద్ద‌తు ఎంతో ఉంటుంద‌ని చెప్పాడు. మ్యాచులో అశ్విన్‌ ఆడిన తీరు పై ఇప్ప‌టికి కూడా అత‌డి తండ్రి 40 ఫోన్ల‌కు పైగా మాట్లాడుతుంటార‌ని అన్నాడు.

Shahbaz Nadeem : క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన టీమ్ఇండియా స్పిన్న‌ర్

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల గురించి మాట్లాడుతూ.. మిగిలిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల వేదిక‌ల‌తో పోలిస్తే ధ‌ర్మ‌శాల చాలా భిన్నంగా ఉంటుందని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక్క‌డి వాతావ‌ర‌ణం చాలా చ‌లిగా ఉంటుంద‌న్నాడు. 21 ఏళ్ల కింద‌ట రెండు నెల‌ల పాటు ఇక్క‌డ అండ‌ర్ 19 క్రికెట్ ఆడిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ 500 వికెట్లు మైలురాయిని చేరుకున్న సంగ‌తి తెలిసిందే. దిగ్గ‌జ ఆట‌గాడు అనిల్ కుంబ్లే త‌రువాత ఈ ఘ‌న‌త సాధించిన రెండో భార‌త ఆట‌గాడిగా అశ్విన్ రికార్డుల్లోకి ఎక్కాడు.

టీమ్ఇండియా త‌రుపున వంద టెస్టులు ఆడిన ఆట‌గాళ్లు వీరే..

సచిన్ టెండూల్కర్ – 200 టెస్టులు
రాహుల్ ద్రవిడ్ – 163
వీవీఎస్ లక్ష్మణ్ – 134
అనిల్ కుంబ్లే – 132
కపిల్ దేవ్ – 131
సునీల్ గవాస్కర్ – 125
దిలీప్ వెంగ్‌సర్కార్ – 116
సౌరవ్ గంగూలీ – 113
విరాట్ కోహ్లి – 113
ఇషాంత్ శర్మ – 105
హర్భజన్ సింగ్ – 103
చెతేశ్వర్ పుజారా -103
వీరేంద్ర సెహ్వాగ్ – 103

Virender Sehwag : సెహ్వాగ్ కాదా? సునీల్ గ‌వాస్క‌ర్ త‌రువాత అత్యుత్త‌మ ఓపెన‌ర్ ఎవ‌రంటే?