Shahbaz Nadeem : క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన టీమ్ఇండియా స్పిన్నర్
టీమ్ఇండియా ఆటగాడు షాబాజ్ నదీమ్ ఆటకు వీడ్కోలు పలికాడు.

Shahbaz Nadeem Announces Retirement
Shahbaz Nadeem : టీమ్ఇండియా ఆటగాడు షాబాజ్ నదీమ్ ఆటకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. టీమ్ఇండియాకు ఆడే దారులు మూసుకుపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. అయితే.. ఉన్ముక్త్ చంద్, అంబటి రాయుడు, నిఖిల్ చౌదరిల మాదరి విదేశాలలో ఆటను కొనసాగిస్తానని ధృవీకరించాడు.
జార్ఖండ్ స్టార్ స్పిన్నర్‌గా పేరుగాంచిన నదీమ్ టీమ్ఇండియా తరుపున రెండు టెస్టు మ్యాచులు ఆడాడు. ఇంగ్లాండ్, దక్షిణాఫిక్రా జట్ల పై ఆడిన అతడు ఎనిమిది వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడి రికార్డు అద్భుతంగా ఉంది. 140 మ్యాచ్‌ల్లో 542 వికెట్లు పడగొట్టాడు. రంజీల్లో జార్ఖండ్ తరుపున అత్యధిక వికెట్లు సాధించిన తీసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 75 ఐపీఎల్ మ్యాచులు ఆడి 48 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 134 మ్యాచ్‌లు ఆడి 175 వికెట్లు తీశాడు.
Virender Sehwag : సెహ్వాగ్ కాదా? సునీల్ గవాస్కర్ తరువాత అత్యుత్తమ ఓపెనర్ ఎవరంటే?
View this post on Instagram
‘అపారమైన కృతజ్ఞత, వినయంతో ఈ రోజు భారత క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాను. నా జీవితంలో 2002 నుంచి 2024 వరకు మధ్య జరిగిన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంది. భారత జట్టుకు ఆడాలనేది ప్రతి ఒక్క చిన్నారి కల. నాకు అవకాశం ఇచ్చిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు, జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్, ధన్‌బాద్ క్రికెట్ అసోసియేషన్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ లకు ధన్యవాదాలు.’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో నదీమ్ రాసుకొచ్చాడు.
Rohit Sharma : ప్రత్యేక హెలికాప్టర్‌లో ధర్మశాలకు చేరుకున్న భారత కెప్టెన్
క్రికెటర్‌గా తన ప్రయాణంలో ఇది తదుపరి దశ అని నమ్ముతున్నట్లు చెప్పాడు. తన జీవితంలో కొత్త అధ్యాయం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు. ఇటీవల ముగిసిన రంజీట్రోఫీ ప్లేట్ విభాగంగలో రాజస్థాన్ పై జార్ఖండ్ తరుపున చివరిసారి ఆడాడు. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది.