New Rule in Cricket : అల‌ర్ట్‌.. రేప‌టి నుంచే క్రికెట్‌లో కొత్త రూల్‌.. బౌల‌ర్ల‌కు క‌ష్ట‌కాల‌మే..!

Stop Clock Rule : ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో రేప‌టి (మంగ‌ళ‌వారం డిసెంబ‌ర్ 12) నుంచి కొత్త రూల్ అమ‌ల్లోకి రానుంది.

ICC to kick Start Stop Clock Trial from ENG vs WI T20

ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో రేప‌టి (మంగ‌ళ‌వారం డిసెంబ‌ర్ 12) నుంచి కొత్త రూల్ అమ‌ల్లోకి రానుంది. వెస్టిండీస్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మొద‌టి టీ20 మ్యాచుతోనే ఈ నూత‌న నిబంధ‌న అమ‌ల్లోకి వ‌స్తున్న‌ట్లు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తెలిపింది. ఇంత‌కీ ఆ రూల్ ఏంటీ..? అని అంటారా..? అదే ”స్టాప్ క్లాక్” రూల్‌.

ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో ఫీల్డింగ్ జ‌ట్టు ఓవ‌ర్‌కు ఓవ‌ర్‌కు మ‌ధ్య అధిక స‌మ‌యాన్ని తీసుకుంటుంది. దీని వ‌ల్ల కొన్ని సార్లు నిర్ణీత స‌మ‌యం క‌న్నా చాలా ఆల‌స్యంగా మ్యాచులు ముగుస్తున్నాయి. ఈ స‌మ్య‌స‌ను త‌గ్గించేందుకు ఇప్ప‌టికే స్లో ఓవ‌ర్ రేట్ అనే నిబంధ‌న ఉంది. ఇదికాకుండా నిర్ణీత స‌మ‌యంలో బౌలింగ్ చేయ‌క‌పోతే 30 యార్ట్ బ‌య‌ట ఒక ఫీల్డ‌ర్ త‌క్కువ‌గా పెట్టే రూల్ కూడా ఉంది. అయిన‌ప్ప‌టికీ కూడా మ్యాచులు ఆల‌స్యంగా ముగుస్తుండ‌డంతో కొత్త‌గా స్టాప్ క్లాక్ రూల్‌ను తీసుకువ‌చ్చింది.

స్టాప్ క్లాక్ రూల్ అంటే..?

స్టాప్ క్లాక్ రూల్ ప్ర‌కారం.. ఓవ‌ర్‌కు ఓవ‌ర్‌కు మ‌ధ్య 60 సెక‌న్ల టైమ్ మాత్ర‌మే ఉంటుంది. ఈ టైమ్‌లోగా ఫీల్డింగ్ జ‌ట్టు బౌల‌ర్ మ‌రుస‌టి ఓవ‌ర్‌ను మొద‌లు పెట్టాల్సి ఉంటుంది. మ్యాచులో రెండు సార్లు గ‌నుక ఫీల్డింగ్ జ‌ట్టు ఈ టైమ్ త‌రువాత కూడా ఓవ‌ర్ ప్రారంభించ‌డంలో విఫ‌లం అయితే ఆ జ‌ట్టుకు 5 ప‌రుగుల పెనాల్టీ విధిస్తారు.

Sunil Gavaskar : ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు పై సునీల్ గ‌వాస్క‌ర్ ఆగ్ర‌హం.. బీసీసీఐ వ‌ద్ద ఉన్న డ‌బ్బు ఉండ‌క‌పోవ‌చ్చు గానీ..

ఈ ప‌రుగులు బ్యాటింగ్ చేసే జ‌ట్టు స్కోరుకు యాడ్ అవుతుంది. రేప‌టి నుంచి వ‌చ్చే ఏడాది ఏప్రిల్ వ‌ర‌కు ఈ నిబంధ‌న ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌ల్లో ఉండ‌నుంది. ఆ త‌రువాత దీని ఫ‌లితాల‌పై స‌మీక్షించి ఓ నిర్ణ‌యానికి రానున్న‌ట్లు ఐసీసీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ వ‌సీంఖాన్ తెలిపారు.

భిన్నాభిప్రాయాలు..

ఇక ఈ రూల్ పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. దీని వ‌ల్ల మ్యాచ్ ఫ‌లితం తారుమారు అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని ప‌లువురు క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు మాత్రం స‌మ‌యం ఆదా అవుతుంద‌ని అంటున్నారు. అయితే.. 60 సెక‌న్ల‌లోనే కెప్టెన్లు ఫీల్డింగ్ సెట్ చేయాలంటే కొంచెం క‌ష్ట‌మ‌ని, బ్యాట‌ర్ల ఆధిప‌త్యం న‌డుస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో దీని వ‌ల్ల బౌల‌ర్లు మ‌రింత ఒత్త‌డికి గుర‌వుతార‌ని అంటున్నారు.

ICC Player of the Month : ష‌మీకి నిరాశ‌.. ప్ర‌పంచ‌క‌ప్ హీరోకే ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు..

ట్రెండింగ్ వార్తలు