T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 లోగో విడుద‌ల‌.. ప్ర‌త్యేక‌త ఏంటంటే..?

T20 World Cup 2024 logo : గురువారం టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024కు సంబంధించిన లోగోల‌ను ఐసీసీ విడుద‌ల చేసింది.

T20 World Cup 2024 logo

భార‌త్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ముగిసింది. ఇక ఇప్పుడు అన్ని జ‌ట్ల దృష్టి 2024లో జ‌ర‌గ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ పై ప‌డింది. జూన్‌లో వెస్టిండీస్‌-యూఎస్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్న ఈ మెగాటోర్నీ కోసం అన్ని జ‌ట్లు సిద్ధం అవుతున్నాయి. ఈ టోర్నీ కోసం అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా గురువారం టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024కు సంబంధించిన లోగోల‌ను విడుద‌ల చేసింది.

పరుషుల క్రికెట్‌, మ‌హిళ‌ల క్రికెట్‌కు సంబందించిన లోగోల‌ను విడుద‌ల చేసింది. లోగోల‌పై క్రికెట్ బ్యాట్, బంతితో పాటు ప్లేయ‌ర్ల‌ ఎన‌ర్జీని సూచించే సంకేతం ఉంది. మొత్తంగా ఈ లోగోలు టీ20 క్రికెట్‌ను ప్ర‌తిబింబించేలా ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ కొత్త లోగోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Sreesanth vs Gambhir : శ్రీశాంత్‌తో గంభీర్‌ గొడ‌వ‌.. స్పందించిన భువ‌నేశ్వ‌రి.. నిజం చెప్పాలంటే..?

20 జ‌ట్లు.. ఏ ప్రాతిప‌దిక‌నంటే..?

2022 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో 16 జ‌ట్లు పోటీ ప‌డ‌గా ఈ సారి మాత్రం 20 జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. ఐసీసీ 12 జ‌ట్ల‌కు నేరుగా అర్హ‌త క‌ల్పించింది. అది ఎలాగంటే.. 2022 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టాప్‌-8 స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్ జ‌ట్ల‌ల‌తో పాటు అతిథ్య హోదాలో యూఎస్‌, వెస్టిండీస్ ల‌తో క‌లిపి మొత్తం 10 జ‌ట్లు నేరుగా అర్హ‌త పొందాయి. అంతేకాకుండా టీ20 ర్యాంకింగ్స్‌లో తొమ్మిది, ప‌ది స్థానాల్లో నిలిచిన అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌లు కూడా డైరెక్టుగా అర్హ‌త సాధించాయి.

మిగిలిన 8 స్థానాల కోసం రీజియ‌న్ల వారీగా క్వాలిఫ‌యింగ్ పోటీల‌ను నిర్వ‌హించారు. అమెరియ‌న్ క్వాలిఫ‌య‌ర్ విన్న‌ర్‌గా నిలిచిన కెన‌డా, ఏసియా క్వాలిఫ‌య‌ర్ ఫైన‌ల్‌కు చేరుకున్న నేపాల్‌, ఒమ‌న్‌, ఈస్ట్ ఆసియా-ఫ‌సిఫిక్ క్వాలిఫ‌య‌ర్ విజేత ప‌పువా న్యూ గినియా, యూరోపియ‌న్ క్వాలిఫ‌య‌ర్ ఫైన‌ల్‌కు చేరుకున్న ఐర్లాండ్‌, స్కాంట్లాండ్‌, ఆఫ్రికా క్వాలిఫ‌య‌ర్ పైనల్‌కు చేరుకున్న ఉగాండ‌, న‌బీబియాలు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు అర్హ‌త సాధించాయి.

Hamza Saleem Dar : టీ10లో ప్ర‌పంచ రికార్డు.. 43 బంతుల్లో 193 నాటౌట్‌.. ఒకే ఓవ‌ర్‌లో ఆరు సిక్స‌ర్లు, 24 బంతుల్లో సెంచ‌రీ ఇంకా..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే జ‌ట్లు..
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్, యూఎస్‌, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌, కెన‌డా, నేపాల్‌, ఒమ‌న్‌, ప‌పువా న్యూ గినియా, ఐర్లాండ్‌, స్కాంట్లాండ్‌, ఉగాండ‌, న‌బీబియా

ట్రెండింగ్ వార్తలు