వరల్డ్ కప్: ప్రతీ జట్టుకు ఒక అవినీతి నిరోధక అధికారి

  • Publish Date - May 14, 2019 / 02:47 PM IST

రాబోయే క్రికెట్ ప్రపంచకప్ టోర్నమెంట్‌ను అవినీతి రహిత టోర్నమెంట్‌గా నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వరల్డ్ కప్‌లో ఆడబోతున్న ప్రతీ జట్టుకు ఒక అవినీతి నిరోధక అధికారిని అటాచ్‌ చేస్తుంది. 10జట్లకు గాను 10మొంది అధికారులను నియమించాలని ఐసీసీ భావిస్తుంది. ఫిక్సింగ్ కానీ, మరేరకమైన అవినీతి మార్గాలకు తావులేకుండా టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

ఇంతకుముందు జట్టు సభ్యులు టోర్నీ ముగిసే లోపు ఎంతో మందిని కలిసేవారు. అందుకే గతంలో ప్రతి మైదానంలో ఓ అవినీతి నిరోధక అధికారిని పెట్టేవారు. ఇప్పుడు అంతమందిని కలిసే అవకాశం లేనందును అదే అధికారిని జట్టుకు అటాచ్‌ చేస్తున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లు, సాధన చేసేటప్పుడు, అసలు మ్యాచ్‌లు ఆడేప్పుడు వీళ్లు టీమ్‌లతోనే ఉంటారు.  వారితో కలిసే హోటళ్లో ఉంటారు. వారితో కలిసే ప్రయాణాలు చేస్తారు. ఆటగాళ్లతో సన్నిహితంగా ఉంటూ, అనుమాస్పదంగా కదులుతున్న వారిపై వీరు నిఘా పెడుతారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌, అవినీతి రహితంగా టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ ఈ చర్య తీసుకుంది.