Rahul Dravid: రచిన్ రవీంద్రపై రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర కామెంట్స్.. సచిన్ ప్రభావమే ఎక్కువట.. ఎందుకంటే?

రవికృష్ణమూర్తికి టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాళ్లు అయిన‌ రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్‌ అంటే విపరీతమైన ఇష్టం కావ‌డంతో.. వారి ఇద్ద‌రి పేర్లు కలిసి వచ్చేలా ..

Rahul Dravid and Rachin Ravindra

Rahul Dravid – Rachin Ravindra : ప్ర‌స్తుతం క్రికెట్ వ‌ర్గాల్లో రచిన్ రవీంద్ర పేరు మార్మోగిపోతోంది. 23 ఏళ్ల ఈ న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్ అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ మొద‌టి మ్యాచులో అజేయ శ‌త‌కంతో త‌న జ‌ట్టును గెలిపించాడు. ఈ క్ర‌మంలో వ‌న్డే ప్రపంచకప్‌ చరిత్రలో కివీస్‌ తరఫున సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయితే, ఈ యువ ప్లేయర్ భారత సంతతికి చెందిన వ్యక్తి. దీంతో రచిన్ రవీంద్రపై భారతీయులుసైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Read Also : Asian Games 2023: ఆసియా క్రీడల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన భారత్.. క్రీడాకారులకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ..

రచిన్ ర‌వీంద్ర పుట్టక ముందే అత‌డి కుటుంబం న్యూజిలాండ్‌కు వెళ్లి స్థిర‌ప‌డింది. అత‌డి తండ్రి రవి కృష్ణమూర్తి బెంగ‌ళూరులో సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్‌గా పనిచేసేవాడు. అయితే.. న్యూజిలాండ్ వెళ్లిన రవి కృష్ణమూర్తి అక్కడ హట్‌ హాక్స్‌ పేరుతో క్రికెట్‌ క్లబ్‌ను ప్రారంభించాడు. మధ్య మధ్యలో కృష్ణమూర్తి బెంగుళూరు వచ్చి క్రికెట్ ఆడేవాడు. 18 న‌వంబ‌ర్ 1999లో రచిన్ ర‌వీంద్ర జ‌న్మించాడు. రవికృష్ణమూర్తికి టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాళ్లు అయిన‌ రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్‌ అంటే విపరీతమైన ఇష్టం కావ‌డంతో.. వారి ఇద్ద‌రి పేర్లు కలిసి వచ్చేలా రాహుల్ ద్రవిడ్ నుంచి Ra, సచిన్ నుంచి chin లతో అతడికి రచిన్ రవీంద్ర అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.

Read Also : Asian Games : ఆసియా విలువిద్య క్రీడలో జ్యోతికి బంగారు పతకం

తాజాగా రచిన్ ప్రదర్శనపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాక్యలు చేశాడు. రచిన్ బ్యాటింగ్ చూశాను.. ఐదు సిక్సులు బాదాడు. అతడి ఆటతీరు చూస్తుంటే సచిన్ ప్రభావమే ఎక్కువగా ఉందని అనిపిస్తుంది. నా ప్రభావం తక్కువగానే ఉందంటూ సరదా వ్యాఖ్యలు చేశారు. నేను ఆఫ్ ది స్వ్కేర్ బంతిని కొట్టలేను. ఒకవేళ సచిన్ అందులో రచిన్ రవీంద్రకు సహాయం చేసి ఉండొచ్చేు అంటూ ద్రవిడ్ సరదా వ్యాఖ్యలు చేశాడు. అయితే, రచిన్ ఆటతీరు చాలా బాగుందంటూ ద్రవిడ్ అన్నారు.