Rohit Sharma
Asia Cup 2022: ఆసియా కప్ -2022 టోర్నమెంట్‌లో భారత్ కథ దాదాపు ముగిసినట్లే. అయితే ఇక్కడో చిన్నఆశ భారత్ అభిమానులకు ఊరటకలిగిస్తోంది. అది సాధ్యమయ్యేది కాకపోయినప్పటికీ.. అసాధ్యాలు కూడా సాధ్యం చేయొచ్చని గతంలో పలు క్రికెట్ టోర్నమెంట్లలో రుజువైంది. తాజాగా, అదే ఆశతో భారత అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆసియా కప్ సూపర్-4లో వరుస ఓటములతో ఫైనల్ ఆశలను టీమిండియా దాదాపు గల్లంతు చేసుకుంది. మంగళవారం రాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో చివరి వరకు పోరాడినప్పటికీ భారత్ జట్టుకు ఓటమి తప్పలేదు.
India vs SriLanka Match: పోరాడి ఓడిన భారత్.. ఆసియా కప్ ఫైనల్ ఆశలు గల్లంతు.. ఫొటో గ్యాలరీ
శ్రీలంకపై ఓటమితో భారత్ ఆసియా కప్ లో ఫైనల్ ఆశలను దాదాపు అసాధ్యం చేసుకుంది. అయితే ఓ చిన్నఆశ భారత్ లోని క్రికెట్ అభిమానులను ఊరిస్తోంది. పాకిస్థాన్ వర్సెస్ ఆఫ్గానిస్థాన్ జట్ల మధ్య బుధవారం సాయంత్రం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ కచ్చితంగా ఓడిపోవాలి. ఒకవేళ ఎవరూ ఊహించని విధంగా పాకిస్థాన్ ఆఫ్గానిస్థాన్ పై ఓడిపోతే.. భారత్ ఫైనల్ కు వెంటనే చేరిపోదు. గురువారం భారత్ వర్సెస్ ఆఫ్గాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో భారత్ జట్టు భారీ విజయం సాధించాల్సి ఉంటుంది.
India Vs Sri Lanka Asia Cup 2022 : రాణించిన రోహిత్ శర్మ.. శ్రీలంక టార్గెట్ 174
క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నట్లు పాకిస్థాన్ పై ఆప్గానిస్థాన్ విజయం సాధించి, ఆఫ్గానిస్థాన్ పై భారత్ విజయం సాధిస్తే.. ఫైనల్ బెర్త్ దరిదాపుల్లోకి చేరొచ్చు. ఫైనల్ కు చేరాలంటే సూపర్ -4లో చివరిగా జరిగే పాకిస్థాన్ – శ్రీలంక మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించాల్సి ఉంటుంది. ఇలా రెండు మ్యాచ్ లలో పాకిస్థాన్ ఓడిపోయి, ఆఫ్గానిస్థాన్ పై భారత్ భారీ విజయం సాధిస్తే ఆసియా కప్ లో టీమిండియా ఫైనల్ కు చేరే అవకాశం లభిస్తుంది.