ILT20 MI Emirates won by 8 wickets and enter into playoffs
ILT20 : ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఎంఐ ఎమిరేట్స్ దూసుకుపోతుంది. వరస విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. శనివారం దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత దుబాయ్ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు సాధించింది. దుబాయ్ బ్యాటర్లలో మహ్మద్ నబీ (22), జేమ్స్ నీషమ్ (21) లు పర్వాలేదనిపించారు. ఎంఐ బౌలర్లలో ఏఎం ఘజన్ఫర్ మూడు వికెట్లు పడగొట్టాడు.
Team India : గిల్‌కు నో ప్లేస్.. నెక్ట్స్ గంభీరేనా? కొత్త కోచ్ వేటలో బీసీసీఐ?
అనంతరం 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఎంఐ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎంఐ బ్యాటర్లలో కీరన్ పొలార్డ్ (44; 31 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ముహమ్మద్ వసీం (27), టామ్ బాంటన్ (28) లు రాణించారు.
ఈ మ్యాచ్‌లో విజయంతో ఎంఐ తమ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. డిసెంబర్ 30న జరగనున్న క్వాలిఫైయర్ 1లో డెజర్ట్ వైపర్స్ తో ఎంఐ అమీతుమీ తేల్చుకోనుంది.