ఇంగ్లాండ్‌తో టీ20 : ఆరో వికెట్ కోల్పోయిన భారత్

First T20 Ind Vs Eng

First T20 IND vs ENG : అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టీ20లో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. 102 పరుగుల వద్ద టీమిండియా వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోగా.. మొత్తం ఆరు వికెట్లు కోల్పోయింది.

ఓపెనర్ శిఖర్ ధావన్ (4), కెఎల్ రాహుల్ (1), విరాట్ కోహ్లీ (0), రిషబ్ పంత్ (0), రిషబ్ పంత్ (21), హార్దిక్ పాండ్యా (19), షార్దూల్ ఠాకూర్ (0) పరుగులకే పెవిలియన్ చేరారు. శ్రేయాస్ అయ్యర్ (46 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సు) 66 హాఫ్ సెంచరీతో దూసుకెళ్తున్నాడు.

19 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 117 పరుగులతో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీసుకోగా, రషీద్, వుడ్, స్టోక్స్ తలో వికెట్ తీసుకున్నారు.