IND vs AFG 3rd T20 : డ‌బుల్ సూప‌ర్ ఓవ‌ర్‌లో భార‌త్ విజ‌యం

అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను భార‌త్ క్లీన్ స్వీప్ చేసింది.

IND vs AFG 3rd T20

డ‌బుల్ సూప‌ర్ ఓవ‌ర్‌లో భార‌త్ విజ‌యం

సూప‌ర్ ఓవ‌ర్‌లో అఫ్గాన్ 16 ప‌రుగులు చేసింది. ఆ త‌రువాత బ్యాటింగ్ దిగిన భార‌త్ కూడా 16 ప‌రుగులే చేయ‌డంతో మ్యాచ్ మ‌రో సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది. రెండో సూప‌ర్ ఓవ‌ర్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ 11 ప‌రుగులు చేయ‌గా అఫ్గాన్ మూడు బంతుల్లో ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి రెండు వికెట్లు కోల్పోవ‌డంతో 10 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.

స్కోర్లు స‌మం.. సూప‌ర్ ఓవ‌ర్‌కు మ్యాచ్‌
ల‌క్ష్య ఛేద‌న‌లో అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి స‌రిగ్గా 212 ప‌రుగులు చేసింది. దీంతో మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది

ఒకే ఓవ‌ర్‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్ రెండు వికెట్లు..
వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఓకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీశాడు. హాఫ్ సెంచ‌రీ చేసి ఊపుమీదున్న ఇబ్ర‌హీం జ‌ద్రాన్ (50; 41 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌)తో పాటు అజ్మతుల్లా ఒమర్జాయ్(0)ల‌ను ఔట్ చేశాడు. 13 ఓవ‌ర్ల‌కు అఫ్గానిస్తాన్ స్కోరు 108/3. మ‌హ్మ‌ద్ న‌బీ (1), గుల్బాదిన్ నైబ్ (2) లు ఆడుతున్నారు.

రహ్మానుల్లా గుర్బాజ్ హాఫ్ సెంచ‌రీ.. ఆ వెంట‌నే ఔట్‌..
కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి 29 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్న రహ్మానుల్లా గుర్బాజ్ (50; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అదే ఓవ‌ర్ ఆఖ‌రి బంతికి వాషింగ్ట‌న్ సుంద‌ర్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో అఫ్గాన్ 10.6వ ఓవర్‌లో 93 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది.

అఫ్గానిస్తాన్ ముందు ల‌క్ష్యం 213
హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ (121నాటౌట్; 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర సెంచ‌రీతో విరుచుకుప‌డ్డాడు. దీంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి 212 ప‌రుగులు చేసింది. రోహిత్ శ‌ర్మ‌తో పాటు రింకూ సింగ్ (69 నాటౌట్; 39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు. అఫ్గానిస్తాన్ బౌల‌ర్ల‌లో ఫరీద్ అహ్మద్ మూడు వికెట్లు తీయ‌గా అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ..
అజ్మతుల్లా బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 64 బంతుల్లో రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో అత‌డికి ఇది 5వ శ‌త‌కం

రోహిత్ శ‌ర్మ అర్ధ‌శ‌త‌కం..
కైస్ అహ్మద్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 41 బంతుల్లో రోహిత్ శ‌ర్మ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 13 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 97/4. రోహిత్ శ‌ర్మ (50), రింకూ సింగ్ (30) లు ఆడుతున్నారు.

సంజు శాంస‌న్ డ‌కౌట్‌..
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌లో మ‌హ్మ‌ద్ న‌బీకి క్యాచ్ ఇచ్చి సంజుశాంస‌న్ (0) గోల్డెన్ డ‌కౌట్‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో భార‌త్ 4.3వ ఓవ‌ర్‌లో 22 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

శివ‌మ్ దూబే ఔట్‌.. 
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ క్యాచ్ అందుకోవ‌డంతో శివ‌మ్ దూబె (1) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 21 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. 4 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 21/3. రోహిత్ (7), సంజుశాంస‌న్ (0) లు ఆడుతున్నారు.

వ‌రుస బంతుల్లో య‌శ‌స్వి, కోహ్లీ ఔట్‌..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌కు ఆదిలోనే డ‌బుల్ షాక్ త‌గిలింది. మూడో ఓవ‌ర్‌ను ఫరీద్ అహ్మద్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో మూడు, నాలుగు బంతుల‌కు వ‌రుస‌గా య‌శ‌స్వి జైస్వాల్ (4), విరాట్ కోహ్లీ (0) లు ఔట్ అయ్యారు. 3 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 19/2. రోహిత్ శ‌ర్మ (6), శివ‌మ్ దూబె (1) లు క్రీజులో ఉన్నారు.

అఫ్గానిస్తాన్ తుది జ‌ట్టు : రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీప‌ర్‌), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్‌), గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, మహ్మద్ సలీమ్ స‌ఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్

భారత తుది జ‌ట్టు : యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, సంజూ శాంసన్(వికెట్ కీప‌ర్‌), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్

IND vs AFG 3rd T20 : మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో మొద‌టి రెండు మ్యాచుల్లో గెలిచిన టీమ్ఇండియా ఇప్ప‌టికే సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. ఈ క్ర‌మంలో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌ర‌గుతున్న నామ‌మాత్ర‌పు మూడో టీ20 మ్యాచులో టీమ్ఇండియా టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భార‌త్ భావిస్తుండ‌గా, ఎలాగైనా విజ‌యం సాధించి ప‌రువు ద‌క్కించుకోవాల‌ని అఫ్గానిస్తాన్ ఆరాట‌ప‌డుతోంది.