×
Ad

IND vs AUS: చాలా కాలం తర్వాత మైదానంలో రోహిత్, కోహ్లీని చూద్దామనుకుంటే.. అక్కడ వర్షం..

ఈ పిచ్‌లో టాస్‌ గెలిచే కెప్టెన్లు మొదట బౌలింగ్ వైపే మొగ్గు చూపుతారు.

Virat Kohli and Rohit Sharma

IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం ఆస్ట్రేలియాలోని పెర్త్‌ స్టేడియంలో తొలి వన్డే జరగాల్సి ఉంది. భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ సుదీర్ఘకాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో కనపడుతుండడంతో దీనిపై ఆసక్తి మరింత పెరిగింది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ చివరిసారిగా ఆడారు. ఏడు నెలల తర్వాత ఇప్పుడు మళ్లీ వారు ఆడుతున్నారు. అయితే పెర్త్‌లోని వాతావరణం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. మొదటి వన్డే సమయంలో అక్కడ వర్షం ఏర్పడే అవకాశం 63 శాతం ఉంది. (IND vs AUS)

అక్యువెదర్.కామ్ తెలిపిన వివరాల ప్రకారం.. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం కురిసే అవకాశం ఉంది. మ్యాచ్ సమయంలో వర్షం పడే ఛాన్స్‌ 35%కు పైగా ఉంది. క్రికెట్ ఆడుతున్న సమయంలో పదే పదే అంతరాయాలు కలగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ పిచ్‌లో టాస్‌ గెలిచే కెప్టెన్లు మొదట బౌలింగ్ వైపే మొగ్గు చూపుతారు.

Also Read: Pakistan-Afghanistan clashes: పాకిస్థాన్‌ను తిట్టిన ట్రంప్‌.. వాళ్లే కారణమంటూ కామెంట్స్‌

స్క్వాడ్స్

భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, ధృవ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ

ఆస్ట్రేలియా జట్టు: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, మ్యాథ్యూ షార్ట్, మ్యాట్ రెన్‌శా, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్(వికెట్ కీపర్), కూపర్ కానోల్లి, మిచెల్ స్టార్క్, జావియర్ బార్ట్లెట్, జోష్ హజెల్‌వుడ్, బెన్ డ్వార్షియస్, నాథన్ ఎల్లిస్, మ్యాథ్యూ క్యూహ్‌నేమన్