×
Ad

Rohit Sharma : శ‌నివారం ఆసీస్‌తో మూడో వ‌న్డే.. రోహిత్ శ‌ర్మ‌ను ఊరిస్తున్న సిక్స‌ర్ల రికార్డు..

ఆసీస్‌తో మూడో వ‌న్డేకు ముందు రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma)ను ఓ భారీ రికార్డు ఊరిస్తోంది.

IND vs AUS 3rd ODI Most sixes in ODIs Rohit Sharma need 6 sixes

Rohit Sharma : టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ ఆసీస్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో విఫ‌ల‌మైన‌ప్ప‌టికి రెండో వ‌న్డేలో ఆక‌ట్టుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌, విరాట్ కోహ్లీ లు ఒకే ఓవ‌ర్‌లో ఔట్ కావ‌డంతో ఓ సీనియ‌ర్ బ్యాట‌ర్ ఇన్నింగ్స్ బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నాడు. త‌న స‌హ‌జ‌శైలికి భిన్నంగా ఆడుతూ ప‌రుగులు రాబ‌ట్టాడు. మొత్తంగా 97 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు సాయంతో 73 ప‌రుగులు సాధించాడు.

తొలి రెండు వ‌న్డేల్లో ఓడిపోయిన భార‌త్ మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను కోల్పోయింది. ఇక నామమాత్ర‌మైన మూడో వ‌న్డే మ్యాచ్ శ‌నివారం (అక్టోబ‌ర్ 25)న జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma)ను ఓ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ ఆరు సిక్స‌ర్లు బాదితే ఓ అరుదైన రికార్డును అందుకుంటాడు.

IND vs AUS : మూడో వ‌న్డేకు ముందు ఆసీస్ జ‌ట్టులో కీల‌క మార్పులు.. ల‌బుషేన్ ఔట్.. ఆ ఇద్ద‌రికి చోటు..

ఆసీస్‌తో మూడో వ‌న్డేలో రోహిత్ శ‌ర్మ ఆరు సిక్స‌ర్లు కొడితే వ‌న్డేల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టిస్తాడు. ప్ర‌స్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ ఆట‌గాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 398 వ‌న్డేల్లో 351 సిక్స‌ర్లు కొట్టాడు. ఇక రోహిత్ శ‌ర్మ విష‌యానికి వ‌స్తే.. 275 వ‌న్డేల్లో 346 సిక్స‌ర్లు బాదాడు. క్రిస్‌గేల్‌, జ‌య‌సూర్య‌, ఎంఎస్ ధోని ఆ త‌రువాతి స్థానాల్లో ఉన్నారు.

వ‌న్డేల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే..

* షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్‌) – 398 మ్యాచ్‌ల్లో 351 సిక్స‌ర్లు
* రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 275 మ్యాచ్‌ల్లో 346 సిక్స‌ర్లు
* క్రిస్‌గేల్ (వెస్టిండీస్‌) – 301 మ్యాచ్‌ల్లో 331 సిక్స‌ర్లు
* స‌న‌త్ జ‌య‌సూర్య (శ్రీలంక‌) – 445 మ్యాచ్‌ల్లో 270 సిక్స‌ర్లు
* ఎంఎస్ ధోని (భార‌త్‌) – 350 బంతుల్లో 229 సిక్స‌ర్లు