IND vs AUS : మూడో వ‌న్డేకు ముందు ఆసీస్ జ‌ట్టులో కీల‌క మార్పులు.. ల‌బుషేన్ ఔట్.. ఆ ఇద్ద‌రికి చోటు..

భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య (IND vs AUS) మూడో వ‌న్డే మ్యాచ్ శ‌నివారం జ‌ర‌గ‌నుంది.

IND vs AUS : మూడో వ‌న్డేకు ముందు ఆసీస్ జ‌ట్టులో కీల‌క మార్పులు.. ల‌బుషేన్ ఔట్.. ఆ ఇద్ద‌రికి చోటు..

Marnus Labuschagne out as CA makes surprise additions to Australia white ball squads

Updated On : October 24, 2025 / 10:08 AM IST

IND vs AUS : భార‌త్‌తో జ‌రుగుతున్న మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఆస్ట్రేలియా కైవ‌సం చేసుకుంది. ఇక నామమాత్ర‌మైన మూడో వ‌న్డే మ్యాచ్ (IND vs AUS ) శ‌నివారం (అక్టోబ‌ర్ 25) జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో క్రికెట్ ఆస్ట్రేలియా.. స్క్వాడ్‌లో ప‌లు మార్పులు చేసింది. స్టార్‌ బ్యాట‌ర్ మార్న‌స్ ల‌బుషేన్‌ను జ‌ట్టు నుంచి తొలగించింది. ఆల్ రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్, స్పిన్నర్ మాట్ కుహ్నెమాన్‌లను జ‌ట్టులోకి తీసుకుంది.

కామెరూన్ గ్రీన్ గాయ‌ప‌డ‌డంతో అనూహ్యంగా ల‌బుషేన్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. అయితే.. తొలి రెండు వ‌న్డేల్లో తుది జ‌ట్టులో అత‌డికి స్థానం ద‌క్క‌లేదు. జ‌ట్టు నుంచి త‌ప్పించ‌డంతో ల‌బుషేన్ డొమెస్టిక్ క్రికెట్‌లో క్వీన్స్‌ల్యాండ్ త‌రుపున ఆడేందుకు వెళ్లాడు.

Harmanpreet Kaur : సెమీస్‌లో అడుగుపెట్టిన భార‌త్‌.. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ కామెంట్స్‌.. ఆ ఇద్ద‌రే..

మాక్స్ వెల్ వ‌చ్చేశాడు..

వ‌న్డే సిరీస్ త‌రువాత భార‌త జ‌ట్టుతో ఆసీస్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడ‌నుంది. ఇప్ప‌టికే తొలి రెండు టీ20ల‌కు జ‌ట్టును ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా మిగిలిన మ్యాచ్‌ల‌కు సైతం జ‌ట్టును ఆసీస్ సెల‌క్ట‌ర్లు ప్ర‌క‌టించారు. ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్ రీఎంట్రీ ఇచ్చాడు. గాయం కార‌ణంగా అత‌డు తొలి రెండు టీ20లు ఆడ‌డం లేదు. యువ పేస‌ర్‌ మహ్లి బియర్డ్‌మాన్‌కు తొలిసారి జాతీయ జ‌ట్టులో చోటు ద‌క్కింది.

పేస‌ర్ జోష్ హేజిల్‌వుడ్‌కు ఆఖ‌రి మూడు టీ20ల‌కు విశ్రాంతి ఇవ్వ‌గా.. అత‌డి స్థానంలో బియర్డ్‌మాన్ చోటు ద‌క్కించుకున్నాడు.

మూడో వ‌న్డేకు ఆస్ట్రేలియా జ‌ట్టు ఇదే..

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ, కూపర్ కోనోలీ, జాక్ ఎడ్వర్డ్స్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాట్ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

Shubman Gill : రోహిత్ శ‌ర్మ పై గిల్ కామెంట్స్‌.. అత‌డు మిస్సైయ్యాడు.

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు ఇదే..

మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్ (తొలి మూడు టీ20లు), జేవియర్ బార్ట్‌లెట్, మహ్లి బియర్డ్‌మాన్ (మూడో టీ20 నుంచి), టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్ (నాలుగు, ఐదు టీ20ల‌కు), నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్ (మొద‌టి రెండు టీ20ల‌కు), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్ (మూడో టీ20 నుంచి), మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.