Shubman Gill : రోహిత్ శర్మ పై గిల్ కామెంట్స్.. అతడు మిస్సైయ్యాడు.
రెండో వన్డేలో టీమ్ఇండియా ఓటమిపై శుభ్‌మన్ గిల్ (Shubman Gill) స్పందించాడు.
Shubman Gill Comments after India lost match australia in 2nd ODI
Shubman Gill : ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌కు ఏదీ కలిసి రావడం లేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓడిపోయింది. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కోల్పోయింది. కాగా.. కీలక క్యాచ్‌లు వదిలివేయడంతోనే ఓడిపోయామని టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు.
మ్యాచ్ అనంతరం ఓటమిపై గిల్ మాట్లాడాడు. టాస్ ఓడిపోవడం పెద్దగా ప్రభావాన్ని చూపలేదన్నాడు. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసినప్పటికి కూడా పోరాడే లక్ష్యాన్ని నమోదు చేశామన్నాడు. అయితే.. ఫీల్డింగ్‌లో కొన్ని క్యాచ్‌లు వదిలివేయడం వల్ల ఆ స్కోరును కాపాడుకోలేకపోయామని చెప్పుకొచ్చాడు. తొలి మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించిందని, అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ పెద్దగా కీలకం కాలేదన్నాడు.
ఇక ఇరు జట్లు కూడా దాదాపు 50 ఓవర్లు ఆడాయన్నాడు. ఆరంభంలో బ్యాటింగ్ చేసేందుకు కాస్త ఇబ్బందిగా అనిపించినా కూడా 15 నుంచి 20 ఓవర్ల తరువాత అంతా కుదురుకుందన్నాడు.
రోహిత్ గురించి ఏమన్నాడంటే..?
సుదీర్ఘ విరామం తరువాత వచ్చి ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడడం అంత సులభం కాదని గిల్ చెప్పాడు. ఆరంభంలో పిచ్ బ్యాటింగ్‌కు సవాల్‌గా ఉందని, అయినప్పటికి కూడా రోహిత్ అద్భుతంగా ఆడాడని అన్నాడు. అయితే.. అతడు భారీ స్కోరు మాత్రం మిస్ అయ్యాడు. మొత్తంగా అతడి బ్యాటింగ్ విషయంలో మాత్రం చాలా సంతోషంగా ఉన్నా అని గిల్ అన్నాడు.
Rohit Sharma : సెంచరీ మిస్.. అయితేనేం గంగూలీ రికార్డును మాత్రం మిస్‌కానీ రోహిత్ శర్మ..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ (73; 97 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (61; 77 బంతుల్లో 7 ఫోర్లు) లు అర్ధశకాలు చేశారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లు తీయగా.. జేవియర్ బార్ట్‌లెట్ మూడు వికెట్లు సాధించాడు. మిచెల్ స్టార్ రెండు వికెట్లు పడగొట్టాడు.
265 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 46.2 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ బ్యాటర్లలో మాథ్యూ షార్ట్ (74; 78 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కూపర్ కొన్నోలీ (61 నాటౌట్; 53 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్‌లు తలా రెండు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్‌లు చెరో వికెట్ సాధించారు.
