IND vs AUS 3rd T20 : మూడో టీ20లో గెలిచిన ఆస్ట్రేలియా

India vs Australia 3rd T20 : ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్లు గౌహ‌తి వేదిక‌గా మూడో టీ20 మ్యాచులో త‌ల‌ప‌డ్డాయి.

IND vs AUS 3rd T20

గెలిచిన ఆస్ట్రేలియా

ఆల్ రౌండ‌ర్ గ్లెన్‌మాక్స్‌వెల్ (104 నాటౌట్; 48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర శ‌త‌కం బాద‌డంతో 223 ప‌రుగుల ల‌క్ష్యాన్ని స‌రిగ్గా 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మి

మాక్స్‌వెల్ అర్ధ‌శ‌త‌కం..
అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మాక్స్‌వెల్ 28 బంతుల్లో అర్ధ‌శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు.

టిమ్ డేవిడ్ ఔట్‌..
ర‌వి బిష్ణోయ్ బౌలింగ్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ క్యాచ్ అందుకోవ‌డంతో టిమ్ డేవిడ్ (0) ఔట్ అయ్యాడు. దీంతో 13.3వ ఓవ‌ర్‌లో134 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది. అంత‌క‌ముందు అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ క్యాచ్ అందుకోవ‌డంతో మార్క‌స్ స్టోయినిస్‌ (17) పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

10 ఓవ‌ర్ల‌కు ఆసీస్ స్కోరు 105/3
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో స‌గం ఓవ‌ర్లు ముగిశాయి. 10 ఓవ‌ర్ల‌కు ఆసీస్ స్కోరు 105/3. గ్లెన్ మాక్స్‌వెల్ (27), మార్క‌స్ స్టోయినిస్ (9) లు ఆడుతున్నారు.

జోస్ ఇంగ్లిష్ క్లీన్ బౌల్డ్‌..
ర‌వి బిష్ణోయ్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్ (10) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 6.2వ ఓవ‌ర్‌లో 68 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది. అంత‌క ముందు అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ (35; 18 బంతుల్లో 8 ఫోర్లు) ఔట్ అయ్యాడు.

ఆరోన్ హార్డీ ఔట్‌..
భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియాకు షాక్ త‌గిలింది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ ఇషాన్ కిష‌న్ క్యాచ్ అందుకోవ‌డంతో ఆరోన్ హార్డీ (16) ఔట్ అయ్యాడు. దీంతో 4.2వ ఓవ‌ర్‌లో 47 ప‌రుగుల వ‌ద్ద ఆసీస్ మొద‌టి వికెట్ కోల్పోయింది. 5 ఓవ‌ర్ల‌కు ఆస్ట్రేలియా స్కోరు 56/1. ట్రావిస్ హెడ్ (31), జోష్ ఇంగ్లిస్ (5)లు ఆడుతున్నారు.

ఆసీస్ టార్గెట్ 223
రుతురాజ్ గైక్వాడ్ (123నాటౌట్; 57 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) శ‌త‌క్కొట్ట‌డంతో గౌహ‌తి వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడో టీ20 మ్యాచులో భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 222 ప‌రుగులు చేసింది. య‌శ‌స్వి జైస్వాల్ (6), ఇషాన్ కిష‌న్ (0)లు విఫ‌ల‌మైనా సూర్య‌కుమార్ యాద‌వ్ (39; 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), తిల‌క్ వ‌ర్మ (31నాటౌట్; 24 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, కేన్ రిచర్డ్‌సన్, ఆరోన్ హార్డీ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

రుతురాజ్ గైక్వాడ్ సెంచ‌రీ
గ్లెన్ మాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 52 బంతుల్లో రుతురాజ్ గైక్వాడ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో అత‌డికి ఇదే తొలి శ‌త‌కం కావ‌డం విశేషం.

రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచ‌రీ
ఆరోన్ హార్డీ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 32 బంతుల్లో రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

సూర్య‌కుమార్ యాద‌వ్ ఔట్‌..
ఆరోన్ హార్డీ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ మాథ్యూ వేడ్ క్యాచ్ అందుకోవ‌డంతో సూర్య‌కుమార్ యాద‌వ్ (39; 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ఔట్ అయ్యాడు. దీంతో 10.2వ ఓవ‌ర్‌లో 81 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ మూడో వికెట్ కోల్పోయింది.

ఇషాన్ కిష‌న్ డ‌కౌట్‌..
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో స్టోయినిస్ క్యాచ్ అందుకోవ‌డంతో ఇషాన్ కిష‌న్ డ‌కౌట్ అయ్యాడు. దీంతో 2.3వ ఓవ‌ర్‌లో 24 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

య‌శ‌స్వి జైస్వాల్ క్లీన్‌బౌల్డ్‌..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో య‌శ‌స్వి జైస్వాల్ (6) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 1.2వ ఓవ‌ర్‌లో 14 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ మొద‌టి వికెట్ కోల్పోయింది.

ఆస్ట్రేలియా తుది జ‌ట్టు : ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(కెప్టెన్‌), నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా, కేన్ రిచర్డ్‌సన్

భారత తుది జ‌ట్టు : యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), రింకూ సింగ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ

టాస్‌..
టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది.

India vs Australia 3rd T20 : ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్లు గౌహ‌తి వేదిక‌గా మూడో టీ20 మ్యాచులో త‌ల‌ప‌డుతున్నాయి. సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న భార‌త్ ఈ మ్యాచ్లో విజ‌యం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని భావిస్తుండ‌గా ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ మ్యాచులో గెలుపొంది సిరీస్‌లో నిల‌వాల‌ని ఆస్ట్రేలియా ప‌ట్టుదల‌గా ఉంది.

ట్రెండింగ్ వార్తలు