KL Rahul
KL Rahul: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ వేదికగా ఇండియా వర్సెస్ ఆసీస్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మూడు రోజుల ఆట పూర్తికాగా.. మంగళవారం నాల్గోరోజు ఆట ప్రారంభమైంది. మూడోరోజు ఆట పూర్తయ్యే సరికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు 445 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే, టీమిండియా బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకొని పరుగులు రాబట్టడంలో విఫలమవుతూ వచ్చారు. మూడోరోజు కీలక బ్యాటర్లు పెవిలియన్ బాటపట్టారు. నాల్గోరోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ సైతం అవుటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
Also Read: AUS vs IND : ఆస్ట్రేలియాతో మూడో టెస్టు.. ఆకాశ్‌దీప్‌పై రోహిత్ శర్మ ఫైర్.. వీడియో వైరల్
నాల్గోరోజు ఆట ప్రారంభం కాగా.. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చారు. అయితే, కేఎల్ రాహుల్ అవుటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ వేసిన బంతిని ఆడే ప్రయత్నంలో బాల్ బ్యాట్ ఎడ్జ్ ను తాకి స్లిప్ లో ఉన్న స్టీవెన్ స్మిత్ చేతిలోకి వెళ్లింది. అయితే, వేగంగా చేతిలోకొచ్చిన క్యాచ్ ను స్మిత్ జారవిడిచాడు. అప్పటికే రాహుల్ 33 పరుగుల వద్ద ఉన్నాడు. స్మిత్ క్యాచ్ చేజార్చిన తరువాత కాస్త జాగ్రత్తగా ఆడుతూ రాహుల్ ఆఫ్ సెంచరీ పూర్తిచేశాడు. అయితే, నాల్గోరోజు ఆట ప్రారంభంలో రాహుల్ తో పాటు క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ (10) తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. కమిన్స్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔట్ అయ్యాడు.
Also Read: AUS vs IND : మూడో టెస్టు.. చేతులెత్తేస్తున్న బ్యాటర్లు.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
రోహిత్ శర్మ అవుట్ కావడంతో రవీంద్ర జడేజా క్రీజులోకి రాగా.. మరో వికెట్ పడకుండా రాహుల్, జడేజా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలో వర్షం పడటంతో మ్యాచ్ ను అంపైర్లు కొద్దిసేపు నిలిపివేశారు. మ్యాచ్ పున:ప్రారంభం తరువాత కూడా ఆచితూచి ఆడుతూ ఆరో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని రాహుల్, జడేజా జోడి నెలకొల్పింది. ఆ తరువాత 141 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాడు. అయితే, ఇక్కడ విశేషం ఏమిటంటే.. నాథన్ లైయన్ బౌలింగ్ లో రాహుల్ (84)అవుట్ కాగా.. ఆ క్యాచ్ ను స్టీవ్ స్మిత్ అందుకున్నాడు. దీంతో రాహుల్ ఆఫ్ సెంచరీ పూర్తిచేసుకునేందుకు అవకాశం ఇచ్చిన స్మిత్.. సెంచరీకి చేరుకొకుండా అడ్డుకున్నాడు.
KL Rahul survives on the first ball of the day. pic.twitter.com/LVHEqaZ2KA
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 16, 2024
The Steven Smith blinder. pic.twitter.com/mcG0nFSZSu
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 17, 2024