IND vs AUS Test Match
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. శనివారం సాయంత్రం ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 289/3గా ఉంది. విరాట్ కోహ్లీ 59 పరుగులతో, రవీంద్ర జడేజా 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు శుభ్‌మన్‌గిల్ సెంచరీ సాధించి ఔటయ్యాడు. గిల్‌కు ఇది రెండో టెస్టు సెంచరీ. కోహ్లీ 14 నెలల తర్వాత టెస్టుల్లో అర్ధ సెంచరీ సాధించడం విశేషం. అంతకుముందు రోహిత్ 35 పరుగులు చేసి ఔటవ్వగా, ఆ తర్వాత పూజారా 42 పరుగులు చేసి ఔటయ్యారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది.
నాలుగో టెస్టు, మూడో రోజు ఆట ముగిసింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఇండియా స్కోరు 289/3గా ఉంది. విరాట్ కోహ్లీ 59 పరుగులతో, రవీంద్ర జడేజా 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇవాళ్టి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌గిల్ సెంచరీ పూర్తి చేసుకోవడం, 14 నెలల తర్వాత కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం హైలైట్స్.
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 92.4 ఓవర్ల వద్ద కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14 నెలలు, 16 ఇన్నింగ్సుల తర్వాత కోహ్లీ టెస్టుల్లో అర్ధ సెంచరీ నమోదు చేయడం విశేషం. 2022 జనవరి తర్వాత కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు.
భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. సెంచరీ సాధించి మంచి ఊపు మీదున్న శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. 235 బంతుల్లో 128 పరుగులు చేసి, లయన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. గిల్ తర్వాత అతడి స్థానంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కు దిగాడు. ప్రస్తుతం ఇండియా స్కోరు 245/3 (78.4) గిల్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
టీమిండియా తొలి ఇన్నింగ్స్ 150 పరుగులకు చేరింది. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో గిల్ (76), పుజారా (34) వికెట్ పడకుండా నిదానంగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. ఈ క్రమంలో 7 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం 51 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా స్కోర్ 152/1.
రెండో సెషన్ ప్రారంభమైన తరువాత భారత బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే నెమ్మదిగా పరుగులు రాబడుతున్నారు. శుభ్‌మన్ గిల్ (73), ఛతేశ్వర్ పుజారా (30) క్రీజులో ఉన్నారు.
https://twitter.com/BCCI/status/1634436359858561024?cxt=HHwWgIDR1bXN164tAAAA
టీమిండియా లంచ్ బ్రేక్ సమయానికి 129/1 స్కోర్ చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (65), ఛతేశ్వర్ పుజారా (22) ఉన్నారు. గిల్, పుజారా 97 బంతులకు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
టీమిండియా స్కోర్ 100 పరుగులకు చేరింది. 36 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ (51), పుజారా (13) పరుగులతో క్రీజులో ఉన్నారు. 29 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమిండియా స్కోర్ 100/1 కు చేరింది.
https://twitter.com/BCCI/status/1634425931581513728?cxt=HHwWgIDT-bTu0q4tAAAA
టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆఫ్ సెంచరీ చేశాడు. 93 బంతులు ఎదుర్కొన్న గిల్ 51 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మూడో రోజు ఆటను ప్రారంభించిన కొద్దిసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ(35) ఔట్ అయ్యాడు. కునెమన్ బౌలింగ్‌లో లబుషేన్ చేతికి చిక్కాడు. దీంతో 74 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. క్రీజులో శుభ్ మన్ గిల్ (38), పుజారా ఉన్నారు.
https://twitter.com/BCCI/status/1634408575836782592?cxt=HHwWgIDUyZb8yq4tAAAA
మూడో రోజు ఆట ప్రారంభమైంది. రోహిత్ శర్మ (31), శుభ్‌మన్ గిల్ (35) దూకుడుగా ఆడుతున్నారు. 17 ఓవర్లకు టీమిండియా 67/0 పరుగులకు చేరింది.
భారత్ , ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోర్ 36/0 తో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ క్రీజులోకి వచ్చారు.