IND vs AUS 4th Test 2023: ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్.. విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ మిస్.. Live Updates

ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్ స్టేడియంలో జరుగుతోంది. కోహ్లీ 186 పరుగులు చేసి ఔటయ్యాడు.

IND vs AUS 4th Test 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి (నాలుగో) టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ 186 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 12 Mar 2023 05:08 PM (IST)

    88 పరుగుల ఆధిక్యంలో భారత్

    నాలుగో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ లో నాలుగో రోజు ఆస్ట్రేలియా స్కోరు 3/0 (6 ఓవర్లలో)గా నమోదైంది. టీమిండియా 88 పరుగుల ఆధిక్యంలో ఉంది.

  • 12 Mar 2023 04:52 PM (IST)

    విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ మిస్..

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగి ఆడాడు. అయితే, డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కోహ్లీ 364 బంతుల్లో 186 బాదాడు. ముర్ఫీ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. టీమిండియా ఆలౌట్ అయింది.

    కోహ్లీ 2019, అక్టోబరు 10న, పుణెలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచులో 254 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇవాళ టెస్టులో డబుల్ సెంచరీ బాదితే, రెండో డబుల్ సెంచరీ అయ్యేది. ఇంతకు ముందు వీరేంద్ర సెహ్వాగ్, కేకే నాయర్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ టీమిండియా నుంచి డబుల్ సెంచరీలు చేశారు.

  • 12 Mar 2023 04:24 PM (IST)

    వెనువెంటనే రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ ఔట్

    రవిచంద్రన్ అశ్విన్ ఔట్ అయ్యాడు. 11 బంతుల్లో 7 పరుగులు చేసిన అశ్విన్.. నాథన్ లియాన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ డకౌట్ అయ్యాడు. టీమిండియా స్కోరు 570/8 (177 ఓవర్లకి)గా ఉంది.

  • 12 Mar 2023 04:08 PM (IST)

    డబుల్ సెంచరీ దిశగా కోహ్లీ

    డబుల్ సెంచరీ దిశగా కోహ్లీ దూసుకెళ్తున్నాడు. 349 బంతుల్లో 183 పరుగులు చేసి, క్రీజులో ఉన్నాడు. అక్షర్ పటేల్ 112 బంతుల్లో 79 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులో కోహ్లీతో పాటు రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 564/6 (175 ఓవర్లకు)గా ఉంది.

  • 12 Mar 2023 03:25 PM (IST)

    అక్షర్ పటేల్ 95 బంతుల్లో అర్ధ సెంచరీ

    అక్షర్ పటేల్ 95 బంతుల్లో అర్ధ సెంచరీ బాదాడు. క్రీజులో కోహ్లీకి చక్కని సహకారం అందిస్తున్నాడు. డ్రింక్స్ బ్రేక్ సమయానికి కోహ్లీ 327 బంతుల్లో 169 పరుగులు చేశాడు. టీమిండియా స్కోరు 519/5 (168 ఓవర్లకు)గా ఉంది.

  • 12 Mar 2023 03:03 PM (IST)

    కోహ్లీ 150 ..

    ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విజృంభిస్తున్నాడు. దీంతో టీమిండియా స్కోర్ 500/5 చేరింది. కోహ్లీ (154), అక్షర్ పటేల్ (47) క్రీజులో ఉన్నారు.

  • 12 Mar 2023 02:55 PM (IST)

    ఆధిక్యంలోకి టీమిండియా..

    తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆధిక్యంలోకి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 480 పరుగులు చేసింది. టీమిండియా 162 ఓవర్లు పూర్తయ్యే సరికి 486 పరుగులు చేసింది. దీంతో ఆరు పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (145), అక్షర్ పటేల్ (47) దూకుడుగా ఆడుతున్నారు.

     

  • 12 Mar 2023 01:53 PM (IST)

    దూకుడుగా ఆడుతున్న విరాట్, అక్షర్ ..

    నాలుగో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు విజృంభిస్తున్నారు. విరాట్ కోహ్లీ సెంచరీతో దూకుడగా ఆడుతుండగా, భరత్, అక్షర్ పటేల్ రాణించారు. దీంతో 153 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ స్కోర్ ఐదు వికెట్లు కోల్పోయి 455 పరుగులకు చేరింది. కోహ్లీ (128), అక్షర పటేల్ (32) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్ ను సమం చేయాలంటే టీమిండియా మరో 25 పరుగులు చేయాల్సి ఉంది.

  • 12 Mar 2023 12:47 PM (IST)

    విరాట్ కోహ్లీ సెంచరీ..

    విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 241 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 100 పరుగులు చేశాడు. దీంతో ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ 139 ఓవర్లకు 400 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ కంటే మరో 80 పరుగులు భారత్ జట్టు వెనుబడి ఉంది.

  • 12 Mar 2023 12:41 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా..

    టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 393 పరుగుల వద్ద లయన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ (44) ఔట్ అయ్యాడు.

  • 12 Mar 2023 12:35 PM (IST)

    సెంచరీకి చేరువలో కోహ్లీ..

    విరాట్ కోహ్లీ సెంచరీకి చేరువయ్యారు. శ్రీకర్ భరత్‌తో కలిసి వికెట్ పడకుండా ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబడుతున్నారు. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీకి దగ్గరయ్యాడు. 236 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 97 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోవైపు భరత్ ఆఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు.

  • 12 Mar 2023 12:32 PM (IST)

    కోహ్లీ, శ్రీకర్ భరత్ కీలక భాగస్వామ్యం ..

    నాలుగో రోజు ఆటలో టీమిండియా ఆటగాళ్లు కోహ్లీ, శ్రీకర్ భరత్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 172 బంతులు ఎదుర్కొన్న వారు 82 పరుగులు చేశారు. కోహ్లీ (97), శ్రీకర్ భరత్ (44) క్రీజులో ఉన్నారు.

  • 12 Mar 2023 11:33 AM (IST)

    నిలకడగా టీమిండియా బ్యాటింగ్ ..

    టీమిండియా బ్యాట్స్‌మెన్ కోహ్లీ, శ్రీకర్ భరత్ నిలకడగా ఆడుతున్నారు. ఆస్ట్రేలియా బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబడుతున్నారు. 131 ఓవర్లు పూర్తయ్యే సరికి.. టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (88), భరత్ (25) క్రీజులో ఉన్నారు.

  • 12 Mar 2023 10:02 AM (IST)

    నాలుగో వికెట్ డౌన్ ..

    టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. నాలుగో రోజు మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే రవీంద్ర జడేజా (28) ఔట్ అయ్యాడు. మర్ఫీ వేసిన బౌలింగ్‌లో ఖవాజాకు దొరికిపోయాడు. దీంతో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 309 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ (67), శ్రీకర్ భరత్ ఉన్నారు.

  • 12 Mar 2023 09:48 AM (IST)

    భారత్ స్కోర్ 300 ..

    ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగోరోజు ఆట ప్రారంభమైంది. 289 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో కోహ్లీ, జడేజా క్రీజులోకి వచ్చారు. క్రీజులోకి వచ్చిరాగానే ఇద్దరూ దాటిగా ఆడుతున్నారు. ప్రస్తుతం 103 ఓవర్లకు టీమిండియా మూడు వికెట్లుకోల్పోయి 302 పరుగులు చేసింది. కోహ్లీ (65), జడేజా (23) పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 12 Mar 2023 09:40 AM (IST)

    నాలుగో రోజు ఆట ప్రారంభం ..

    ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భాగంగా నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. విరాట్ కోహ్లీ, జడేజా క్రీజులోకి వచ్చారు.

ట్రెండింగ్ వార్తలు