IND vs AUS 5th Test Virat Kohli woes outside off stump continue
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలం అయ్యాడు. తన బలహీనత ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్‌ను కొనసాగిస్తూ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బొలాండ్ బౌలింగ్‌లో స్లిప్‌లో స్టీవ్ స్మిత్ చేతికి చిక్కాడు. ఈ సిరీస్‌లో కోహ్లీని బొలాండ్ ఔట్ చేయడం ఇది నాలుగో సారి. దీంతో భారత జట్టు 59 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయింది.
ఓ వైపు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ సైతం టెస్టుల్లో రిటైర్‌మెంట్ తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జట్టు కోసం అంటూ రోహిత్ శర్మ సిడ్నీ టెస్టు నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలో అందరి దృష్టి కోహ్లీపైనే పడింది. కీలకమైన మ్యాచులో సీనియర్ రోహిత్ శర్మ దూరం అయిన నేపథ్యంలో మరింత బాధ్యతాయుతంగా కోహ్లీ ఆడతాడు అని అనుకుంటే అలాంటిది ఏమీ జరగలేదు. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు సరికదా.. పదే పదే ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను వేటాడుతూ కీపర్ లేదా స్లిప్‌లలో క్యాచ్ ఇచ్చి ఔట్ అవుతున్నాడు.
సిడ్నీ మ్యాచులో అదే విధంగా ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్‌మెంట్ కావాలనే డిమాండ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ప్రకటిస్తే ఆ వెంటనే ఆ తదుపరి రిటైర్‌మెంట్ కత్తి కోహ్లీ మెడపై వేలాడడం ఖాయం. ఈ సిరీస్‌లో కోహ్లీ ఓ సెంచరీ మినహా మిగిలిన అన్ని మ్యాచుల్లో విఫలం అయ్యాడు. ఈ సిరీస్‌లో విరాట్ స్కోర్లు.. 5, 100*, 7, 11, 3, 36, 5, 17, 6.
మొత్తం 9 ఇన్నింగ్స్‌ల్లో 23.75 సగటుతో 190 పరుగులు మాత్రమే చేశాడు. సెంచరీని తీసివేస్తే.. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 90 పరుగులు మాత్రమే చేశాడు.
Jasprit Bumrah : ఆస్ట్రేలియా గడ్డపై బుమ్రా అరుదైన ఘనత.. 46 ఏళ్ల రికార్డు బ్రేక్..
The Scott Boland show is delivering at the SCG!
He’s got Virat Kohli now. #AUSvIND pic.twitter.com/12xG5IWL2j
— cricket.com.au (@cricketcomau) January 4, 2025