Jasprit Bumrah : ఆస్ట్రేలియా గడ్డపై బుమ్రా అరుదైన ఘనత.. 46 ఏళ్ల రికార్డు బ్రేక్..
టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు.

IND vs AUS 5th Test Bumrah breaks 46 year old Indian Test record in Australia
టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచులో ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ లను ఔట్ చేసి బుమ్రా ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో టీమ్ఇండియా దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ రికార్డును బద్ధలు కొట్టాడు.
1977/78 సీజన్‌లో ఆసీస్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో బేడీ 31 వికెట్లు తీశాడు. తాజాగా బుమ్రా 32 వికెట్లతో ఈ రికార్డును బద్దలు కొట్టాడు. 46 ఏళ్ల రికార్డును బుమ్రా బ్రేక్ చేయడంతో అతడి ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే అత్యధిక బౌలింగ్ రేటింగ్ సాధించిన భారత బౌలర్‌గా బుమ్రా నిలిచిన సంగతి తెలిసిందే.
Rohit Sharma: నేనా.. రిటైర్మెంటా..? సిడ్నీ టెస్టులో ఆడకపోవడంపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ
రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో సిడ్నీ మ్యాచులో జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలో టీమ్ఇండియా బరిలోకి దిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 72.2 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటైంది. టీమ్ఇండియా బ్యాటర్లలో రిషబ్ పంత్ (40) టాప్ స్కోరర్. రవీంద్ర జడేజా (26), జస్‌ప్రీత్ బుమ్రా (22), శుభ్‌మన్ గిల్ (20) లు ఫర్వాలేదనిపించారు. యశస్వి జైస్వాల్ (10), కేఎల్ రాహుల్ (4), నితీశ్ రెడ్డి (0) లు విఫలం అయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బొలాండ్ నాలుగు వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్ మూడు, పాట్ కమిన్స్ రెండు, నాథన్ లైయాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ల్లో 43 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. పాట్ కమిన్స్ (6), బ్యూ వెబ్‌స్టర్ (52)లు క్రీజులో ఉన్నారు. ఆసీస్ ఇంకా 30 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్‌లు తలా రెండు వికెట్లు తీశారు.
🚨 HISTORY BY JASPRIT BUMRAH. 🚨
– Bumrah with 32 wickets becomes the most successful Indian bowler in a single Australian tour, surpassing Bishan Singh Bedi’s 31 wickets. 🐐 pic.twitter.com/f7OsVdUmpQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 3, 2025