BBL Collision : క్రికెట్ చ‌రిత్ర‌లోనే భయాన‌క ఘ‌ట‌న‌.. క్యాచ్ ప‌ట్టుకునే క్ర‌మంలో ఢీ కొన్న ఇద్ద‌రు ఆసీస్ ఆట‌గాళ్లు.. స్ట్రెచ‌ర్ పై ఆస్ప‌త్రికి త‌ర‌లింపు..

ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఓ భ‌యాన‌క సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

BBL Collision : క్రికెట్ చ‌రిత్ర‌లోనే భయాన‌క ఘ‌ట‌న‌.. క్యాచ్ ప‌ట్టుకునే క్ర‌మంలో ఢీ కొన్న ఇద్ద‌రు ఆసీస్ ఆట‌గాళ్లు.. స్ట్రెచ‌ర్ పై ఆస్ప‌త్రికి త‌ర‌లింపు..

BBL Collision Aussie Players Injured After Worst Collision In Cricket

Updated On : January 3, 2025 / 8:39 PM IST

క్రికెట్ ఆడేట‌ప్పుడు మైదానంలో ఆట‌గాళ్లు గాయ‌ప‌డ‌డాన్ని చూస్తూనే ఉంటాం. అయితే.. ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఓ భ‌యాన‌క సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇద్ద‌రు ఆట‌గాళ్లు క్యాచ్ అందుకునే క్ర‌మంలో ఒక‌రిని మ‌రొక‌రు చూసుకోకుండా ఢీ కొట్టారు. ఒక‌రికి ముక్కులోంచి ర‌క్తం రాగా.. మ‌రొక‌రు న‌డ‌వ‌లేక‌పోయారు. దీంతో ఇద్ద‌రిని ఆస్ప‌త్రికి ఆస్ప‌త్రించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా పెర్త్‌ స్కార్చర్స్‌, సిడ్నీ థండర్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో పెర్త్ ఇన్నింగ్స్ 16వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఓవ‌ర్‌ను పెర్గూస‌న్ వేశాడు. ఓ బంతిని పెర్త్‌ బ్యాట‌ర్ కూప‌ర్ కొన్నాలీ మిడ్ వికెట్ దిశ‌గా భారీ షాట్ ఆడాడు. బంతి ఎడ్జ్ తీసుకోవ‌డంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్ర‌మంలో క్యాచ్‌ను అందుకునేందుకు డేనియ‌ల్ సామ్స్‌, కామెరాన్ బాన్‌క్రాప్ట్‌లు ప్ర‌య‌త్నించారు.

Karun Nair : చరిత్ర సృష్టించిన కరుణ్‌ నాయర్‌.. ప్ర‌పంచ క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు..

ఇద్ద‌రు ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చారు. ఒక‌రిని మ‌రొక‌రు చూసుకోలేదు. క్యాచ్ అందుకునే క్ర‌మంలో ఇద్ద‌రూ ఢీకొన్నారు. మైదానంలోనే ఇద్ద‌రూ ప‌డిపోయారు. లేవ‌లేదు. దీంతో ఆట‌గాళ్ల‌తో పాటు అభిమానులు షాక్‌కు గురిఅయ్యారు. వెంట‌నే ఆట‌గాళ్లు, స‌హ‌య‌క సిబ్బంది వారి వ‌ద్ద‌కు వెళ్లారు. బాన్‌క్రాప్ట్ ముక్కులోంచి ర‌క్తం కారింది. ఇక సామ్స్ న‌డ‌వ‌లేక‌పోయాడు. వారిద్ద‌రిని స్ట్రెచ‌ర్ సాయంతో బ‌య‌ట‌కు తీసుకువెళ్లారు.

ఈ ఘ‌ట‌న పై సిడ్నీ థండ‌ర్ టీమ్ స్పందించింది. వారిద్ద‌రు మిగిలిన మ్యాచ్‌లో ఆడ‌ర‌ని తెలిపింది. వారిద్ద‌రు కంక‌ష‌న్‌కు గురి అయ్యార‌ని, ప్రాక్చ‌ర్లు అయ్యే అవ‌కాశాలు ఉండ‌డంతో వారిద్ద‌రిని ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు చెప్పింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. కాగా.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

SA vs PAK : ద‌క్షిణాఫ్రికాతో రెండో టెస్టు.. మ్యాచ్ ఆరంభ‌మైన కాసేటికే పాకిస్థాన్‌కు భారీ షాక్‌.. స్ట్రెచర్ పై ఆస్ప‌త్రికి పాక్ ప్లేయ‌ర్‌..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో పెర్త్‌ స్కార్చర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 177 ప‌రుగులు చేసింది. పెర్త్ బ్యాట‌ర్ల‌లో ఫిన్‌ అలెన్‌ ( 68) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. అనంత‌రం 178 ప‌రుగుల ల‌క్ష్యాన్ని సిడ్నీ థండర్ ఆఖ‌రి బంతికి ఛేదించింది. సిడ్నీ ఆట‌గాళ్ల‌లో డేవిడ్‌ వార్నర్‌ (49), మాథ్యూ గిల్కెస్‌ (43)లతో పాటు షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్ (19 బంతుల్లో 39 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్‌తో జ‌ట్టును గెలిపించాడు.