IND vs BAN Hardik Pandya Need 3 wickets to enter into 100 t20 wickets club
Hardik Pandya : ఆసియాకప్ 2025లో టీమ్ఇండియా అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకెళుతోంది. సూపర్-4 తొలి మ్యాచ్‌లో పాక్‌ను చిత్తు చేసిన భారత్ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. బుధవారం దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ను ఓ రికార్డు ఊరిస్తోంది.
ఈ మ్యాచ్‌లో పాండ్యా మూడు వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. నాలుగు వికెట్లు తీస్తే టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
2016లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు 118 మ్యాచ్‌లు ఆడాడు. 27.6 సగటుతో 1820 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్థశతకాలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో 97 వికెట్లు సాధించాడు. ఇందులో మూడు సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. అత్యుత్తమ ప్రదర్శన 4/16.
అంతర్జాతీయ టీ20ల్లో టీమ్ఇండియా తరుపున 100 వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ ఉన్నాడు. అంతేకాదండోయ్ పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గానూ కొనసాగుతున్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* అర్ష్‌దీప్ సింగ్ – 64 ఇన్నింగ్స్‌ల్లో 100 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 106 ఇన్నింగ్స్‌ల్లో 97 వికెట్లు
* యుజ్వేంద్ర చాహల్ – 79 ఇన్నింగ్స్‌ల్లో 96 వికెట్లు
* జస్‌ప్రీత్ బుమ్రా – 72 ఇన్నింగ్స్‌ల్లో 92 వికెట్లు
* భువనేశ్వర్ కుమార్ – 86 ఇన్నింగ్స్‌ల్లో 90 వికెట్లు
SL vs PAK : భారత్ చేతిలో ఓటమి.. శ్రీలంకతో పాక్‌కు డూ ఆర్ డై మ్యాచ్.. ఓడితే ఇంటికే..
ఇదిలా ఉంటే.. ఆసియాకప్ 2025 సూపర్ 4 పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. బంగ్లాదేశ్ పై విజయం సాధిస్తే ఫైనల్ చేరుకునే అవకాశాలు మరింత మెరుగు అవుతాయి.