IND vs BAN Yashasvi and Siraj win Impact Fielder of Series medal
IND vs BAN : ప్రతీ సిరీస్ తరువాత ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను అందజేయడం భారత జట్టు మేనేజ్‌మెంట్ ఆనవాయితీ. ఇది కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ వచ్చాక కూడా కొనసాగిస్తున్నారు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సిరాజ్ లు ఫీల్డింగ్‌లో మెరుపులు మెరిపించారు. అద్భుత క్యాచులు అందుకున్నారు. బంగ్లాదేశ్ సిరీస్‌లో ‘ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’గా ఎవరు నిలిచారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ విడుదల చేసింది.
ప్రతి సారి ఒక్కరినే ఈ అవార్డు వరిస్తుండగా ఈ సారి ఇద్దరికి ఇవ్వడం విశేషం. విల్లులా వెనక్కి వంగిపోయి క్యాచ్ అందుకున్న సిరాజ్‌తో పాటు సిరీస్ ఆసాంతం మెరుగైన ఫీల్డింగ్ చేసిన యశస్వి జైస్వాల్‌లకు ఈ సారి అవార్డు ఇస్తున్నట్లు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ వెల్లడించారు. అతి తక్కువ అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకున్నారన్నారు.
Rohit Sharma : బంగ్లాదేశ్ పై సిరీస్ విజయం.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్
చెన్నై వంటి ఉక్కపోతగా ఉండే వాతావరణంలో, కాన్పూర్‌లోనూ వర్షం కారణంగా మైదానం చాలా తేమగా ఉన్నప్పటికి ఏకాగ్రత కోల్పోకుండా చక్కని ఫీల్డింగ్‌తో అలరించారు. ప్రతి ఒక్కరూ గ్రౌండ్‌లో అద్భుత ప్రదర్శన చేశారు. ఈ సారి జైస్వాల్, సిరాజ్‌లకు అవార్డును ఇవ్వబోతున్నాం. అని దిలీప్ అన్నారు.