Ind vs Eng 1st Test Day 2 : ముగిసిన రెండో రోజు ఆట‌

ఉప్ప‌ల్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది.

Ind vs Eng 1st Test Day 2

ముగిసిన రెండో రోజు ఆట‌
మొద‌టి టెస్టు మ్యాచులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి 421 ప‌రుగులు చేసింది. ర‌వీంద్ర జ‌డేజా (81), అక్ష‌ర్ ప‌టేల్ (35) లు క్రీజులో ఉన్నారు.

అశ్విన్ ర‌నౌట్‌.. 
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. అశ్విన్ (1) ర‌నౌట్ అయ్యాడు. దీంతో 90.3వ ఓవ‌ర్‌లో 358 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ ఏడో వికెట్ కోల్పోయింది.

కేఎస్ భ‌ర‌త్ ఎల్బీడ‌బ్ల్యూ..
టీమ్ఇండియా మ‌రో వికెట్ కోల్పోయింది. జో రూట్ బౌలింగ్‌లో కేఎస్ భ‌ర‌త్‌(41) ఎల్బీడ‌బ్ల్యూగా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో భార‌త్ 88.2వ ఓవ‌ర్‌లో 356 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది.

జ‌డేజా హాఫ్ సెంచ‌రీ
జోరూట్ బౌలింగ్‌లో మూడు ప‌రుగులు తీసి ర‌వీంద్ర జ‌డేజా 84 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో హాఫ్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. 83 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 336/5. జ‌డేజా (52), కేఎస్ భ‌ర‌త్ (29) లు క్రీజులో ఉన్నారు.

టీ బ్రేక్‌..
రెండో రోజు టీ విరామానానికి టీమ్ఇండియా ఐదు వికెట్లు న‌ష్ట‌పోయి 309 ప‌రుగులు చేసింది. ర‌వీంద్ర జ‌డేజా (45), శ్రీక‌ర్ భ‌ర‌త్ (9)లు క్రీజులో ఉన్నారు.

కేఎల్ రాహుల్ ఔట్‌.. 
శ‌త‌కం దిశ‌గా వెలుతున్న కేఎల్ రాహుల్ (86; 123 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ఔట్ అయ్యాడు. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో రెహాన్ అహ్మద్ క్యాచ్ అందుకోవ‌డంతో రాహుల్ పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో భార‌త్ 64.5వ ఓవ‌ర్‌లో 288 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

శ్రేయ‌స్ అయ్య‌ర్ ఔట్‌.. 
రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో టామ్ హార్ట్లీ క్యాచ్ అందుకోవ‌డంతో శ్రేయ‌స్ అయ్య‌ర్ (35) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 52.3వ ఓవ‌ర్‌లో 223 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

రెండో రోజు లంచ్ బ్రేక్‌..
రెండో రోజు లంచ్ విరామానికి భార‌త్ మూడు వికెట్లు న‌ష్టపోయి 222 ప‌రుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (55), శ్రేయ‌స్ అయ్య‌ర్ (34) లు ఉన్నారు.

కేఎల్ రాహుల్ హాఫ్ సెంచ‌రీ
జోరూట్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన కేఎల్ రాహుల్ 72 బంతుల్లో 6 ఫోర్ల‌తో హాఫ్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. 48 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 212/3. కేఎల్ రాహుల్ (50), శ్రేయ‌స్ అయ్య‌ర్ (29)లు క్రీజులో ఉన్నారు.

గిల్ ఔట్‌.. 
టీమ్ఇండియా మ‌రో వికెట్ కోల్పోయింది. టామ్ హార్డ్లీ బౌలింగ్‌లో బెన్ డ‌కెట్ క్యాచ్ అందుకోవ‌డంతో శుభ్‌మ‌న్ గిల్ (23) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 34.5వ ఓవ‌ర్‌లో 159 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

జైస్వాల్ ఔట్‌..
రెండో రోజు ఆట ఆరంభ‌మైన కాసేప‌టికే దూకుడుగా ఆడుతున్న య‌శ‌స్వి జైస్వాల్ (80; 74 బంతుల్లో 10 ఫోర్లు, 3సిక్స‌ర్లు) ఔట్ అయ్యాడు. జో రూట్ బౌలింగ్‌లో అత‌డికే క్యాచ్ ఇచ్చి జైస్వాల్ పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో భార‌త్ 123 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

ప్రారంభ‌మైన రెండో రోజు ఆట‌
ఓవ‌ర్ నైట్ స్కోరు 119/1 తో రెండో ఆటను ఆరంభించింది భార‌త్‌. య‌శ‌స్వి జైస్వాల్ (76), గిల్ (14)లు క్రీజులో ఉన్నారు. అంత‌క‌ముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 246 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే.