Ind vs Eng: ఓలీ పోప్ సెంచరీ.. కోలుకున్న ఇంగ్లండ్, ముగిసిన మూడో రోజు ఆట

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ సెంచరీ కొట్టాడు.

Ind vs Eng 1st Test Day 3 Ollie Pope century in uppal match

Ind vs Eng 1st Test Day 3: టీమిండియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ సెంచరీ సాధించాడు. 154 బంతుల్లో 10 ఫోర్లతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో అతడికి 5వ సెంచరీ. సెకండ్ ఇన్నింగ్స్ లో శతకం బాదడం అతడికిదే మొదటిసారి కావడం విశేషం. తాజా సెంచరీతో కలుపుకుని భారత్ లో టీమిండియాపై సెకండ్ ఇన్నింగ్స్ లో 2018 నుంచి ఇప్పటివరకు కేవలం రెండు సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. 2022లో బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక బ్యాటర్ దిముత్ కరుణరత్నే సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టాడు.

ఇక తాజా మ్యాచ్ విషయానికి వస్తే.. 163 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టల్లో పడిన ఇంగ్లండ్ జట్టేను ఓలీ పోప్ సెంచరీతో ఆదుకున్నాడు. బెన్ ఫోక్స్ తో కలిసి ఆరో వికెట్ కు 112 పరుగులు జోడించి జట్టును ఒడ్డును పడేశాడు. బెన్ ఫోక్స్ 34 పరుగులు చేసిన అక్షర్ పటేల్ బౌలింగ్ లో 6వ వికెట్ గా అవుటయ్యాడు. జాక్ క్రాలే 31, బెన్ డకెట్ 47, బెయిర్ స్టో 10 పరుగులు చేశారు. రూట్(2), బెయిర్ బెన్ స్టోక్స్ (6) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమిండియా 436 పరుగులకు ఆలౌటైంది.

Also Read: హైదరాబాద్ బ్యాటర్ ఊచకోత.. 39 ఏళ్ల రవిశాస్త్రి రికార్డ్ బ్రేక్.. ఏకంగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన యువ క్రికెటర్

శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు నష్టపోయి 316 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ కు 126 పరుగుల ఆధిక్యం లభించింది. ఓలీ పోప్ (148), రెహన్ అహ్మద్(16) క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు.