IND vs ENG : ఇంగ్లండ్ జట్టుదే తొలి బ్యాటింగ్.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి భారత్.. ఎందుకంటే?

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గురువారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

IND vs ENG 1st Test

IND vs ENG 1st Test Live Updates: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గురువారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్ లో స్పిన్నర్లపై భారీ నమ్మకాన్ని ఉంచినట్లు కనిపిస్తోంది. ఈ మ్యాచ్ కు ముగ్గురు స్పిన్నర్లు బరిలోకి దిగారు. రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజాలతో పాటు అక్షర్ పటేల్ కు తుదిజట్టులో చోటు దక్కింది. ఇంగ్లండ్ తరపున ఓపెనర్లుగా జాకీ క్రౌలీ, బెన్ డకెట్ లు ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. టీమిండియా తొలి ఓవర్ ను ప్రధాన బౌలర్ బుమ్రా వేశాడు. బుమ్రా 33 టెస్టుల్లో ఇప్పటి వరకు 140 వికెట్లు తీశాడు.

Also Read : IND vs ENG : టీమ్ఇండియాను స‌వాల్ చేసిన‌ ఇంగ్లాండ్‌..! ఒక్క రోజు ముందుగానే.. అంత న‌మ్మ‌కం ఏంటో మ‌రీ..!

ఉప్పల్ స్టేడియంలోని పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుంది. పొడిగా ఉన్న పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా మారే అవకాశం ఉంది. దీంతో ముగ్గురు స్పిన్నర్లతో భారత్ జట్టు బరిలోకి దిగింది. ఇక్కడ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అశ్విన్ (27), జడేజా (15) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ మ్యాచ్ లో ఆ ఇద్దరు బౌలర్లు ఉన్నారు. అశ్విన్ మరో పది వికెట్లు తీస్తే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయి చేరుకుంటాడు. మరోవైపు ఈ మ్యాచ్ లో మూడో స్పిన్నర్ కోసం అక్షర్ పటేల్, కుల్ దీప్ మధ్య తీవ్రపోటీ ఏర్పడింది. అయితే, భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అక్షర్ వైపే మొగ్గుచూపాడు. దీనికి కారణంలేకపోలేదు. అక్షర్ పటేల్ ఆల్ రౌండర్. స్పిన్ తో పాటు బ్యాటింగ్ ను సమర్థవంతంగా చేయగలడు. అంతేకాక, ఎక్కువ సేపు క్రీజులో ఉండగలడు. దీంతో రోహిత్ అక్షర్ ను తుది జట్టులోకి తీసుకున్నారు.

Also Read : Rohit Sharma : తొలి టెస్టుకు ముందు రోహిత్ శ‌ర్మ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. ఇంగ్లాండ్ బ‌జ్‌బాల్ ఆడితే..

భారత్ తుది జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఇంగ్లాండ్ తుది జట్టు..
జాక్ క్రాలీ, బెన్ డకెట్, అలీపోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టో్క్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్.

 

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు