KL Rahul : అయ్యో రాహుల్ ఎంత‌ప‌నైంది.. 50వ టెస్టులో 100 మిస్‌.. అయినా ఓ రికార్డు

రీ ఎంట్రీలో కేఎల్ రాహుల్ అద‌ర‌గొడుతున్నాడు.

KL Rahul

రీ ఎంట్రీలో కేఎల్ రాహుల్ అద‌ర‌గొడుతున్నాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌తో పాటు ద‌క్షిణాప్రికా ప‌ర్య‌ట‌న‌లోనూ అద్భుతంగా రాణించారు. దీంతో అభిమానులు రాహుల్ 2.0 అని ముద్దుగా పిలుచుకుంటున్నాడు. స్వ‌దేశంలో ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మొద‌టి టెస్టు మ్యాచులోనూ రాహుల్ త‌న కెరీర్‌లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఉప్ప‌ల్‌లో ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న టెస్టు మ్యాచ్ రాహుల్ కెరీర్‌లో 50వ టెస్టు మ్యాచ్ కావ‌డం విశేషం.

త‌న కెరీర్‌లో మైల్ స్టోన్ లాంటి టెస్టు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ తృటిలో సెంచ‌రీని చేజార్చుకున్నాడు. ఈ మ్యాచ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 123 బంతుల్లో ఎదుర్కొన్న రాహుల్ 8 ఫోర్లు, 2సిక్స‌ర్లు బాది 86 ప‌రుగులు చేశాడు. 14 ప‌రుగుల తేడాతో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు.

Shoaib Malik : షోయ‌బ్ మాలిక్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. కాంట్రాక్ట్ ర‌ద్దు..!

ఈ మ్యాచ్‌లో రాహుల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. ఇంగ్లీష్ స్పిన్ త్ర‌యం జాచ్‌లీక్‌, టామ్ హార్ట్లీ, రెహాన్ అహ్మ‌ద్‌ల‌తో పాటు పార్ట్‌టైమ్ స్పిన్న‌ర్ జోరూట్‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొని ప‌రుగులు చేశాడు. శుభ్‌మ‌న్ గిల్‌తో క‌లిసి మూడో వికెట్ కు 36 ప‌రుగులు జోడించాడు. ఇక నాలుగో వికెట్‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ (35)తో క‌లిసి 64 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

72 బంతుల్లో కేల్ రాహుల్ హాఫ్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. స్వ‌దేశంలో టెస్టుల్లో 1000 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. అర్ధ‌శ‌త‌కం త‌రువాత వేగం పెంచిన రాహుల్ ధాటిగా ఆడాడు. 65వ ఓవ‌ర్‌లో టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించి రెహాన్ అహ్మద్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఔటై పెవిలియ‌న్‌కు వెలుతున్న రాహుల్‌కు ప్రేక్ష‌కులు లేచి నిల‌బ‌డి చ‌ప్ప‌ట్లు కొట్టారు. కాగా.. ఐదో వికెట్‌కు రాహుల్‌, జడేజా జోడీ 65 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెలకొల్పారు.

AUS vs WI : చూసుకోవాలి గ‌దా మామా.. ఇప్పుడు ఏమైందో చూడు.. ఔటైతివి.. దెబ్బలు గ‌ట్టిగానే త‌గిన‌ట్లున్నాయ్‌గా..!

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 246 ప‌రుగులకు ఆలౌటైంది. రెండో రోజు టీ విరామ స‌మ‌యానికి తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 5 వికెట్లు కోల్పోయిన 309 ప‌రుగులు చేసింది. ర‌వీంద్ర జ‌డేజా (45), కేఎస్ భ‌ర‌త్ (9)లు క్రీజులో ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు