Ind vs Eng 3rd ODI : ఇంగ్లండ్ లక్ష్యం 330.. వన్డే సిరీస్ ఎవరిదో..?

మూడు వన్డేలో సిరీస్‌లో ఆఖరి వన్డే పుణే వేదికగా జరుగుతోంది. చివరి వన్డేలో టీమిండియా 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రత్యర్థి జట్టు ఇంగ్లండ్ కు 330 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.

Ind vs Eng 3rd ODI : మూడు వన్డేలో సిరీస్‌లో ఆఖరి వన్డే పుణే వేదికగా జరుగుతోంది. చివరి వన్డేలో టీమిండియా 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రత్యర్థి జట్టు ఇంగ్లండ్ కు 330 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. కోహ్లీసేనను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ (37), శిఖర్ ధావన్ (67) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (7) చేతులేత్తేశాడు.

అనంతరం రిషబ్ పంత్ (78) రెచ్చిపోయాడు. పంత్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. హార్దిక్ పాండ్యా కూడా (64) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. భారత ఆటగాళ్లలో ధావన్, పంత్, హార్దిక్ మాత్రమే అత్యధిక స్కోరు చేశారు. మిగతా ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ (7), కృనాల్ పాండ్యా (25), శార్దూల్ ఠాకూర్ (30), భువనేశ్వర్ కుమార్ (3) పరిమితయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్కవ్ వుడ్ మూడు వికెట్లు తీసుకోగా, రషీద్ రెండు వికెట్లు పడగొట్టాడు.

స్టోక్స్, మెయిన్ అలీ, లివింగ్ స్టోన్, సామ్ కరణ్, టోప్లీకి తలో వికెట్ దక్కింది. ఇప్పటికే ఈ సిరీస్ లో ఇరుజట్లు తలో మ్యాచ్ గెలిచాయి. ఆఖరి వన్డేలో ఏ జట్టు గెలుస్తోందో మూడు వన్డేల సిరీస్ ఆ జట్టుకే దక్కనుంది. ఇరుజట్లు సిరీస్ చేజిక్కినేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు