IND vs ENG 4th T20 : దంచికొట్టిన దూబె, పాండ్యా.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే?

నాలుగో టీ20 మ్యాచ్‌లో భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 181 ప‌రుగులు చేసింది.

టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్లు హార్దిక్ పాండ్యా (53; 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), శివ‌మ్ దూబె (53; 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. దీంతో పూణే వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 181 ప‌రుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 182 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో సాకిబ్ మహమూద్ మూడు వికెట్లు తీశాడు. జామీ ఓవర్టన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. బ్రైడన్ కార్సే, ఆదిల్ రషీద్ చెరో వికెట్ సాధించారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు శుభారంభం ల‌భించ‌లేదు. ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్‌లో సాకిబ్ మహమూద్ భార‌త్‌కు వ‌రుస షాకులు ఇచ్చాడు. పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తూ సంజూ శాంస‌న్ (1) జ‌ట్టు స్కోరు 12 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన తిల‌క్ వ‌ర్మ గోల్డెన్ డ‌కౌట్ అయ్యాడు. నాలుగో స్థానంలో వ‌చ్చిన కెప్టెన్ సూర్య‌కుమార్ (0) నాలుగు బంతులు ఆడి ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఈ ముగ్గురు కూడా సాకిబ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యారు.

Virat Kohli : అరె బాప్‌రే.. కోహ్లీ రంజీ రీ ఎంట్రీని పీడ‌క‌లగా మార్చిన హిమాన్షు సాంగ్వాన్ ఎవ‌రో తెలుసా? ధోని లాగే ఇత‌డు కూడా..

దీంతో భార‌త్ 12 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో మ‌రో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ (29; 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) తో క‌లిసి రింకూ సింగ్‌ (30; 26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశాడు. ఓ వైపు వికెట్లు ప‌డినా మ‌రోవైపు అభిషేక్ త‌న‌దైన శైలిలో బౌండ‌రీలు కొడుతూ ప‌రుగులు రాబ‌ట్టాడు. అయితే.. ధాటిగా ఆడే క్ర‌మంలో ఆదిల్ ర‌షీద్ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 45 ప‌రుగుల నాలుగో వికెట్ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది.

ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న రింకూ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. కార్సే బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అప్ప‌టికి భార‌త స్కోరు 79/5గా ఉంది. ఈ ద‌శ‌లో ఆల్‌రౌండ‌ర్లు హార్దిక్ పాండ్యా, శివ‌మ్ దూబెలు భార‌త్‌ను ఆదుకున్నారు. హార్దిక్ పాండ్యా ఇంగ్లాండ్ బౌల‌ర్ల పై ఎదురుదాడికి దిగాడు.

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్కు బీసీసీఐ లైఫ్ టైమ్ గిఫ్ట్..

ఎడా పెడా బౌండ‌రీలు బాదుతూ స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఈ క్ర‌మంలో 27 బంతుల్లోనే హార్దిక్అ ర్థ‌శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు. మ‌రో వైపు ఆరంభంలో ఆచితూచి ఆడిన దూబె క్ర‌మంగా జోరు అందుకున్నాడు. అర్థ‌శ‌త‌కం అనంత‌రం పాండ్యా ఔట్ కాగా.. 31 బంతుల్లో దూబె హాఫ్ సెంచ‌రీ చేశాడు. పాండ్యా, దూబె జోడి ఆరో వికెట్‌కు 87 ప‌రుగులు జోడించింది. అక్ష‌ర్ ప‌టేల్ (5) విప‌లం కాగా అర్ష్‌దీప్ సింగ్‌(0) డ‌కౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ ఆఖ‌రి బంతికి దూబె ర‌నౌట్ అయ్యాడు.