Virat Kohli : అరె బాప్‌రే.. కోహ్లీ రంజీ రీ ఎంట్రీని పీడకలగా మార్చిన హిమాన్షు సాంగ్వాన్ ఎవరో తెలుసా? ధోని లాగే ఇతడు కూడా..
దాదాపు 12 ఏళ్ల తరువాత విరాట్ కోహ్లీ రంజీట్రోఫీ బరిలోకి దిగాడు. సెంచరీ చేస్తాడని భావిస్తే ఓ యువ బౌలర్ బౌలింగ్‌లో సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరుకున్నాడు.

Who is Himanshu Sangwan to know about fast bowler who dismissed Kohli
అంతర్జాతీయ క్రికెట్‌లోనే హేమాహేమీ బౌలర్లు సైతం టీమ్ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ పేరు చెబితేనే హడలిపోతుంటారు. ప్రత్యర్థి బౌలర్లపై అంతలా ఆధిపత్యం చెలాయిస్తూ వారికి ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు మిగిల్చాడు కోహ్లీ. అలాంటి ఆటగాడిని ఒక్కసారి ఔట్ చేసినా చాలు అదే అరుదైన గౌరవంగా భావిస్తూ ఉంటారు చాలా మంది బౌలర్లు. అలాంటి ఆరివీర భయంకరమైన ఆటగాడిని ఓ అనామక బౌలర్ భయపెట్టాడు. అంతేకాదండోయ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
దాదాపు 12 ఏళ్ల తరువాత విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ బరిలోకి దిగాడు. రైల్వేస్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ తరుపున ఆడుతున్నారు. గురువారం తొలి రోజు రైల్వేస్ బ్యాటింగ్ చేయడంతో ఫీల్డింగ్‌కే పరిమితం అయ్యాడు. రెండో ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగింది. యశ్ ధుల్ ఔట్ కావడంతో కోహ్లీ మైదానంలోకి వచ్చాడు. వచ్చి రావడంతో బౌండరీ బాది మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు కోహ్లీ. దీంతో ఫ్యాన్స్ ఉప్పొంగిపోయారు. విరాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ వస్తుందని ఆశించారు. అయితే.. సెంచరీ కాదు కదా.. కనీసం డబుల్ డిజిట్ కూడా అందుకోలేకపోయాడు.
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్కు బీసీసీఐ లైఫ్ టైమ్ గిఫ్ట్..
Harish Sangwan Knocked Out Virat King Kohli , At The Score of 6 (Full Crowd Reaction + Celebration) #ViratKohli𓃵 | #ViratKohli pic.twitter.com/QBHLRfsLKb
— 𝐒𝐑𝐈𝐉𝐀𝐍 🇮🇹 (@LegendDhonii) January 31, 2025
రైల్వేస్ పేసర్ హిమాన్షు సాంగ్వాన్ ఇన్ స్వింగర్‌తో కోహ్లీని బోల్తా కొట్టించాడు. బ్యాట్, ప్యాడ్ మధ్య ఖాళీలోంచి వెళ్లిన బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో 6 పరుగులకే దిగ్గజ ఆటగాడు పెవిలియన్‌కు చేరుకున్నాడు. కోహ్లీ ఔట్ కావడంతో స్టేడియం మొత్తం ఒక్కసారి నిశ్శబ్ధంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ కుర్రాడి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ప్రస్తుతం అతడు ఎవరు అనేది తెలుసుకునే పనిలో ఉన్నారు నెటిజన్లు.
ఎవరీ హిమాన్షు సాంగ్వాన్..
ఢిల్లీలోని నజఫ్‌గడ్‌లో 1995 సెప్టెంబర్ 2న జన్మించాడు హిమాన్షు సాంగ్వాన్. 29 ఏళ్ల ఈ ఆటగాడు రైట్ ఆర్మ్ మీడియం పేసర్. ప్రస్తుతం ర్వైలేస్‌కు ఆడుతున్న అతడు అంతకముందు ఢిల్లీ తరుపున ఆడాడు. 2019లో విజయ్ హజారే ట్రోఫీ ద్వారా లిస్ట్ ఏ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టీ20 అరంగేట్రం చేసి చేశాడు. అదే ఏడాది రంజీల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు.
ఇప్పటి వరకు 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచులు ఆడి 77 వికెట్లు తీశాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో 17 మ్యాచులు ఆడి 21 వికెట్లు పడగొట్టాడు. 7 టీ20 మ్యాచుల్లో 5 వికెట్లు సాధించాడు.
టికెట్ కలెక్టర్..
సంగ్వాన్ తన క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించకముందు ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో టికెట్ కలెక్టర్‌గా పని చేశాడు. ఆ తరువాత ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో తన పేస్‌కు పదును పెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఆధ్వర్యంలో శిక్షణ పొందాడు. ఈ క్రమంలో రాటు దాలేడు. ముంబైతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ద్వారా అతడు వెలుగులోకి వచ్చాడు. అజింక్యా రహానే, పృథ్వీ షా ల వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 60 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి వార్తల్లో నిలిచాడు.