అండ‌ర్‌-19 మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో భార‌త్‌.. వ‌రుస‌గా రెండోసారి.. సెమీస్‌లో ఇంగ్లాండ్ పై ఘ‌న విజ‌యం..

వ‌రుస విజ‌యాల‌తో మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌కు భార‌త్ దూసుకువెళ్లింది.

అండ‌ర్‌-19 మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో భార‌త్‌.. వ‌రుస‌గా రెండోసారి.. సెమీస్‌లో ఇంగ్లాండ్ పై ఘ‌న విజ‌యం..

PIC Credit @ BCCI Women twitter

Updated On : January 31, 2025 / 3:16 PM IST

ICC Under 19 Womens T20 World Cup 2025 : డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టు మలేషియా వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్-19 మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అద‌ర‌గొడుతోంది. వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. శుక్ర‌వారం ఇంగ్లాండ్‌తో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజ‌యం సాధించి వ‌రుస‌గా రెండో సారి భార‌త్ ఫైన‌ల్ కు చేరుకుంది.

ఇంగ్లాండ్ నిర్దేశించిన 114 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 15 ఓవ‌ర్ల‌లో ఒక్క వికెట్ కోల్పోయి మాత్ర‌మే ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో జి.కమలిని (56; 50 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీ చేసింది. తెలుగు తేజం గొంగ‌డి త్రిష (35; 29 బంతుల్లో 5 ఫోర్లు) వేగంగా ఆడింది. ఈ ఓపెన‌ర్లు ఇద్దరితో పాటు వన్ డౌన్ బ్యాట‌ర్ సానికా చాల్కే (11 నాటౌట్ ) రాణించింది.

Virat Kohli: విరాట్ కోహ్లీ ఫెయిల్.. రంజీ రీఎంట్రీలోనూ సేమ్ సీన్.. 15 బాల్స్ ఆడి.. జస్ట్..

ఓ మోస్త‌రు లక్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన భార‌త్‌కు ఓపెన‌ర్లు త్రిష‌, క‌మలిని లు చ‌క్క‌ని ఆరంభాన్ని ఇచ్చారు. భీక‌ర ఫామ్‌లో ఉన్న త్రిష ఇంగ్లాండ్ బౌల‌ర్ల పై ఎదురుదాడికి దిగింది. ఎడా పెడా బౌండ‌రీలు బాదింది. మ‌రోవైపు క‌మలిని సైతం త‌న దైన శైలిలో ప‌రుగులు సాధించింది. తొలి వికెట్‌కు త్రిష‌, క‌మ‌లిని జోడి 60 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పింది. త్రిష ఔట్ అయినా స‌రే క‌మలిని, సానికాతో క‌లిసి భార‌త్‌కు విజ‌యాన్ని అందించింది.

రాణించిన భార‌త బౌల‌ర్లు..

అంత‌క ముందు భార‌త బౌల‌ర్ల ధాటికి ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 113 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో డేవినా సారా (45), అబి నోర్‌గ్రోవ్ (30) లు రాణించారు. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, పరునికా చెరో మూడు వికెట్లు తీశారు. ఆయుషి రెండు వికెట్లు సాధించింది.

IND vs PAK : పాక్ ఆట‌గాళ్ల‌కు మాజీ కెప్టెన్ వార్నింగ్‌.. భార‌త ప్లేయ‌ర్ల‌తో స్నేహం చేయొద్దు..

మ‌రో సెమీఫైన‌ల్ మ్యాచులో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా విజ‌యం సాధించింది. ఇక ఫైన‌ల్ మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 2 ఆదివారం జ‌ర‌గ‌నుంది. భార‌త్‌, సౌతాఫ్రికాలు క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్నాయి.