Virat Kohli: విరాట్ కోహ్లీ ఫెయిల్.. రంజీ రీఎంట్రీలోనూ సేమ్ సీన్.. 15 బాల్స్ ఆడి.. జస్ట్..

  • Published By: Mahesh T ,Published On : January 31, 2025 / 11:29 AM IST
Virat Kohli: విరాట్ కోహ్లీ ఫెయిల్.. రంజీ రీఎంట్రీలోనూ సేమ్ సీన్.. 15 బాల్స్ ఆడి.. జస్ట్..

Taken From X.com

Updated On : January 31, 2025 / 3:50 PM IST

12 ఏళ్ల తర్వాత రంజీల్లోకి రీ ఎంట్రి ఇచ్చిన విరాట్ కోహ్లీ కోసం జనం క్యూ కట్టి జై కొడితే అక్కడ కూడా కోహ్లీ నిరాశ పరిచాడు. రన్ మెషిన్ పరుగులను చూడొచ్చని వచ్చిన వారి ఆశలపై నీళ్లు చల్లాడు. కేవలం ఆరు పరుగులకే ఔటయ్యాడు. 15 బాల్స్ ఆడిన కోహ్లీ జస్ట్ 6 రన్స్ చేశాడు. రైల్వేస్ రైట్ ఆర్మ్ పేసర్ హిమాన్షు సంగ్వాన్ వేసిన బంతికి ఆఫ్ స్టంప్ ఎగిరిపడింది. అంతకు ముందు బాల్ ఫోర్ కొట్టిన కోహ్లీ మళ్లీ అదే టైప్ లో షార్ట్ ఆడదామనుకున్నాడు. కానీ కోహ్లీ బ్యాడ్ లక్ బౌల్ మరింత స్వింగ్ అయి ఫాస్ట్ గా వచ్చి ఆఫ్ స్టంప్ ను పడగొట్టింది. దీంతో ఫ్యాన్స్ పిచ్చ నిరుత్సాహానికి గురయ్యారు.

ఈ మధ్య కాలంలో ఇంటర్నేషనల్ లెవల్లో కోహ్లీ వరుసగా విఫలం అవుతుండడంతో మళ్లీ దేశవాళీ క్రికెట్ లోకి వచ్చాడు. ఢిల్లీ తరఫున బరిలో దిగాడు. 2012లో ఢిల్లీ తరఫున రంజీల్లో ఆడిన కోహ్లీ ఆ తర్వాత మళ్లీ రంజీల్లోకి
రావడం ఇదే తొలిసారి. కోహ్లీని చూడడానికి రంజీ మ్యాచ్ అయినా సరే 15వేలకు పైగా ఫ్యాన్స్ ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియానికి వచ్చారు.

మొదటి రోజు రైల్వేస్ బ్యాటింగ్ చేసి 241 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఢిల్లీ బ్యాటింగ్ చేయగా.. కోహ్లీ ఫోర్త్ ప్లేస్ లో బ్యాటింగ్ కి వచ్చాడు. ఆల్రెడీ మూడు వికెట్లు పడడంతో కోహ్లీ మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ కోహ్లీ కూడా నిరాశపరిచాడు. కోహ్లీ ఔట్ అవ్వగానే స్టేడియం నుంచి జనాలు బయటకు వెళ్లిపోవడం కనిపించింది.